Friday, May 10, 2024
- Advertisement -

బాబు బండారం బద్దలు……… కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేలా చేసింది నరేంద్రమోడీ

- Advertisement -

2014 నుంచీ కూడా లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ మాటలతో ఊదరగొట్టిన చంద్రబాబు చేతల్లో చూపించింది మాత్రం భజన మీడియా కూడా గర్వంగా నిజాలు చెప్పలేనంత. ప్రపంచంలోనే ఏ దేశానికి, దేశంలోని ఏ రాష్ట్రానికి ఈ స్థాయి పెట్టుబడులు రాలేదన్న అబద్ధాలు మాత్రం ఘనంగా చెప్తూ ఉంటారు. ఇక ఇప్పటికీ వస్తున్న కంపెనీలన్నీ కూడా శ్రీసిటి, మేథా టవర్స్‌లో మాత్రం సెటిల్ అవుతున్నాయి. ఆ రెండింటినీ నిర్మించింది వైఎస్సార్. ఇక సెజ్‌ల ఏర్పాటు కూడా వైఎస్ హయాంలో జరిగిందే. కాకపోతే నాడు ఇదే పచ్చ మీడియా భూ పందేరం……భూ కైంకర్యం అంటూ వార్తలు రాసి ఆ భూములన్నీ వైఎస్ తినేస్తున్నాడన్నంత స్థాయిలో వార్తలు రాసి ప్రజలను హడలగొట్టింది. ఇక ఇప్పుడు చంద్రబాబు హైదరాబాద్‌లో ఎకరం స్థలం ఉన్న బసవతారకం ఆస్పత్రిని అమరావతిలో కూడా స్థాపించడానికి బాలకృష్ణకు ఐదు వందల ఎకరాలు కేటాయిస్తే మాత్రం అంతా అభివృద్ధే అని ప్రజలను నమ్మించాలని చూస్తూ ఉంటుంది బాబు అండ్ భజన మీడియా.

ఇక రీసెంట్‌గా కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌కి రావడం వెనకాల తన కృషి అంతా ఇంతా కాదని బాబు ఘనంగా చెప్పుకున్నాడు. ఇక పచ్చ మీడియా కూడా ఓ రేంజ్‌లో భజన ప్రచారం చేసిపెట్టింది. అయితే ఇప్పుడు తాజాగా బాబు ప్రచార పటాటోపం బద్దలయ్యేవార్తలు ఢిల్లీలో హల్చల్ చేస్తున్నాయి. జాతీయస్థాయిలో ప్రచారాంశం అేవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి కియా మోటార్స్ రావడం వెనుక నరేంద్రమోడీ హస్తం ఉంది. ఈవెన్ ఈ కంపెనీ ప్రారంభోత్సవానికి కూడా మోడీ రావాలనుకున్నాడట. అయితే చంద్రబాబు మాత్రం తన క్రెడిట్‌లోనే పడాలని పిఎంఓ ఆఫీస్ విజ్ఙప్తిని లైట్ తీసుకున్నాడట. ఆ తర్వాత కూడా కంపెనీ ప్రారంభోత్సవానికి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఏ ఒక్కరినీ కూడా పిలవలేదు. మొత్తం క్రెడిట్ తన అకౌంట్‌లో వేసుకున్నాడు. అయితే కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌కి రావడం వెనకాల మోడీ కృషి ఉందన్న విషయం లేట్‌గా తెలుసుకున్న బిజెపి నేతలు క్రెడిట్ మొత్తం టిడిపి అధినేత చంద్రబాబు కొట్టేసిన వైనంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిజెపిలో ఉన్న టిడిపి కోవర్ట్స్ కూడా ఈ విషయం బయటకు రాకుండా బాబుకు సాయం చేశారట. బిజెపి యువ మోర్చా అధ్యక్షుడు విష్ణువర్థనరెడ్డి తాజాగా ఇదే విషయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు. మోడీ చేసిన సాయాన్ని మాత్రం బాబు అస్సలు ప్రస్తావించడం లేదని…….క్రెడిట్ మొత్తం టిడిపి జనాలే కొట్టేస్తున్నారని వాపోయాడు. మొత్తంగా చూస్తే కియా మోటార్స్ చుట్టూ బాబు చూపించిన సినిమా తెరవెనుక నిజాలు మాత్రం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. అలాగే మోడీ ఏం చేసినా కూడా బాబు, బాబు భజన మీడియాలు కలిసి బాబు అకౌంట్‌లో వేసుకుంటూ అన్యాయం చేసిన విషయాలకు వచ్చేసరికి బిజెపిని బదనాం చేస్తున్నారని టిడిపి బ్యాచ్‌పై బిజెపి నేతలు విరుచుకుపడుతున్నారు. హోదా పేరెత్తితే అరెస్టే…..హోదా వేస్ట్…..ప్యాకేజ్ బెస్ట్ అని చెప్పిన చంద్రబాబు దోషి కాదా? అని బిజెపి రాష్ట్ర నేతలు ప్రశ్నిస్తున్నారు. అఫ్కోర్స్…..బిజెపి నేతలు ఎంత నెత్తీ నోరు మొత్తుకున్నా ఉపయోగం ఏమైనా ఉంటుందా? బాబు తప్పులను కవర్ చేయడానికి…….ప్రపంచంలోనే చంద్రబాబంత సమర్థుడైన పాలకుడు ఇంకొకరు లేరు. ప్రపంచ కంపెనీలన్నీ కూడా బాబు మొహం చూసే ఆంధ్రాకు వస్తున్నాయని సీమాంధ్రులను నమ్మించడానికి పచ్చ మీడియా చేసే ప్రయత్నాల ముందు ఈ బిజెపి నేతల ఆవేదన అరణ్యరోదనే అవుతుందనడంలో సందేహం లేదనుకోండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -