- Advertisement -

టీడీపీలో భారీ కుద‌రు…సైకిల్ దిగుతున్న తెలుగు త‌మ్ముళ్లు …..

- Advertisement -

ప్ర‌స్తుతం టీడీపీ ప‌రిస్థితి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇటీవ‌లి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోవ‌డంతో ఆ పార్టీ ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది. పార్టీలో బాబును ఎవ‌రూ లెక్క‌చేడంలేదు. ఎన్నిక‌ల్లో ఓట‌మికి బాబే కార‌ణ‌మ‌ని నాయ‌కులు ఆరోప‌న‌లు చేస్తున్నారు. కొడుకు కోసం బాబు పార్టీ ప‌టిష్టంపై శ్ర‌ద్ద చూప‌లేద‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకోసం ఇత‌ర పార్టీలోకి వ‌ల‌స వెల్లేందుకు సిద్ద‌మ‌వుతున్నారు.

అందుకు త‌గ్గ‌ట్టుగానె ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ కాపు నేతలు రహస్యంగా సమావేశమయ్యారు. ఇప్పుడు ఇదే పార్టీలో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో పలువురు టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో గురువారం నాడు సమావేశమయ్యారు.

రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీ లేదా బీజేపీలోకి వెళ్లే అంశంపైే వీరంతా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరిపోకపోతే తమకు భవిష్యత్తులో అన్నివిధాలా సమస్యలు తప్పవని భావిస్తున్న వీరంతా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇవాళ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్ప‌టికే టీడీపీకి చెందిన ఆరుగురు రాజ్య‌స‌భ్యులు క‌మ‌లం గూటికి చేరేందుకు రంగం సిద్దం అయ్యింది.

ఈ సమావేశంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఉన్నారు ఈ నేతలు ఎందుకు సమావేశమయ్యారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ వైపు ఈ నేతలు చూస్తున్నారా… ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అని సర్వత్రా చర్చ సాగుతోంది. బాబు విదేశీ టూర్ లో ఉన్నారు. ఇటు తెలుగు త‌మ్ముళ్లు సైకిల్ దిగేందుకు సిద్ద‌మ‌య్యారు. మ‌రి బాబు ఇలాంటి సంక్షోభాన్ని ఎలా అధిగ‌మిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -