మోడీ సర్కార్ పై కాలు దువ్వుతోన్న జగన్ ?

- Advertisement -

గత కొన్ని రోజుల ముందు వరకు ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రం ప్రభుత్వంతో అనుకూలంగానే ఉంటూ వచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి ఎన్నో విమర్శలు ఎదురవుతున్నప్పటికి వైఎస్ జగన్ మాత్రం కేంద్రాన్ని నిలదీసే విధానంలో వెనుకడుగు వేస్తూనే వచ్చారు. అటు వైసీపీ శ్రేణులు కూడా కేంద్ర ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుండే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ.. బీజేపీపై కయ్యనికి కాలు దువ్వుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఏపీ అప్పుల విషయాన్ని కేంద్రం వేలెత్తి చూపించడంతో అక్కడినుంచి బీజేపీకి వైసీపీకి మద్య చెడిందని చెప్పవచ్చు..

అంతకు ముందు కేంద్రంతో అనుకూలంగా ఉంటూ వచ్చిన సి‌ఎం జగన్ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు. ఇటీవల పోలవరం విషయంలో కేంద్రం తీరుపై సి‌ఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా వైసీపీ శ్రేణులు కూడా కేంద్ర ప్రభుత్వంపై గట్టిగానే మండి పడుతున్నారు. తాజాగా ఎంపీ విజయ సాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ఆర్థిక స్థితిపై కేంద్ర ప్రభుత్వం కావాలనే దుష్ప్రచారం చేస్తోందని, కేంద్ర ఆర్థిక పరిస్థితి కంటే ఏపీ ఆర్టిక పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పుకొచ్చారు. అసలు రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని మండి పడ్డారు. ప్రస్తుతం విజయ సాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

దీన్ని బట్టి చూస్తుంటే వైసీపీ కేంద్రంతో దూరంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు కూడా 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత మోడీ ప్రభుత్వంతో అనుకూలంగానే ఉంటూ వచ్చారు. కానీ 2019 ఎన్నికల ముందు కేంద్రంతో ఒక్కసారిగా విభేదించారు చంద్రబాబు. అదే విధానాన్ని వైఎస్ జగన్ కూడా ఫాలో అవుతున్నారా అనే రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అనుకూలంగా ఉండడం వల్ల సి‌ఎం జగన్ పై బురదజల్లే విదంగా టీడీపీ ప్రజల్లోకి బలంగా వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల మెల్ల మెల్లగా కేంద్రంతో పూర్తిగా దూరమయ్యేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్దమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Also Read

మాట తప్పిన మోడీ !

ఉచితపథకాలు.. ఆపితే ?

అప్పుల ఊబిలో రాష్ట్రాలు.. ఎంతో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -