“కాపు నేస్తం” రేపిన చిచ్చు ..!

- Advertisement -

ఏపీ సి‌ఎం వైఎస్ జగన్ కాపు సామాజిక వర్గాన్ని అవమాన పరిచాడా ? అంటే అవుననే అంటున్నాయి కాపు సామాజిక వర్గాలు… ఎందుకంటే ఇటీవల జగన్ కాపులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యాలే ఈ రకమైన చర్చకు తావిస్తోంది. ఇటీవల ” కాపు నేస్తం ” పథకానికి నిధులు విడుదల నిర్వహించిన సభలో సి‌ఎం జగన్.. చంద్రబాబు పైన అలాగే పవన్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. చంద్రబాబు తన పాలనలో కాపులకు చాలా అన్యాయం చేశాడని, కాపులకు ఏటా 1000 కోట్ల నిధులు మంజూరు చేస్తామని, తన అయిదేళ్ళ పాలనలో కేవలం 1500 కోట్లు మాత్రమే ఇచ్చాడని ద్వాజమెత్తారు. అంతే కాకుండా కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్దలేనని చెప్పుకొచ్చారు..

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసే క్రమంలో ” కాపు ఓట్లను పవన్ కల్యాణ్ చంద్రబాబు అమ్మేస్తాడు ” అని చెప్పుకొచ్చారు సి‌ఎం జగన్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపైనే కాపు సామాజికవర్గ ప్రముఖులు మండి పడుతున్నారు. పవన్ కల్యాణ్ పై ఎన్నో రకాలుగా విమర్శలు చేయవచ్చు అందులో అభ్యంతరం లేదుగాని, కాపు ప్రజలను అమావాన పరిచేలా ” కాపు ఓట్లను అమ్మేస్తాడు ” అనడం సరైంది కాదని, ఆ విషయంలో జగన్ కాపు సామాజిక వర్గాన్ని అవమాన పరిచడాని ఆ వర్గంలోని ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అంటే జగన్ దృష్టిలో ” కాపు ఓటర్లు అమ్ముడు పోతారనే ” ఉద్దేశం ఉన్నట్లే కదా ? అంటూ మండి పడుతున్నారు. అయితే సి‌ఎం జగన్ ఆ వ్యాఖ్యలు పవన్ ను ఉద్దేశించి విమర్శనాత్మకంగా చేసినప్పటికీ పెడార్థం రావడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర తీసినట్లైంది. ఇక సి‌ఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ కాపు నేతలు కూడా వివరణ ఇచ్చుకోలేకపోతున్నారట. మరి ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారక ముందే వైసీపీ నేతలు దీనిపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

Also Read

హీట్ పెంచుతోన్న ఈటెల ?

బీజేపీతో సమరానికి సిద్దమైన జగన్ ?

మాట తప్పిన మోడీ !

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -