Monday, May 6, 2024
- Advertisement -

పవన్, జెపిల పచ్చ డ్రామాలు…… దిమ్మతిరిగే కౌంటర్స్‌తో రెడీ అవుతున్న మోహన్‌బాబు

- Advertisement -

పవన్ కళ్యాణ్‌ని తెర వెనుక ఉండి నడిపిస్తున్నది చంద్రబాబే అనే మాట ముమ్మాటికీ నిజం. అయితే ఆ విషయం ప్రజలకు తెలియకుండా ఉండడం కోసం అప్పుడప్పుడూ బాబును కూడా ఒక మాట సున్నితంగా అంటూ ఉంటాడు పవన్. టిడిపి వారు కూడా అంతే సున్నితంగా పవన్‌కి కౌంటర్స్ వేస్తూ ఉంటారు. అలా జనాలను వెర్రి వెంగళప్పలను చేసే రాజకీయ డ్రామాలు చంద్రబాబుకు అస్సలు కొత్త కాదు. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణతో చంద్రబాబు నడిపిన రాజకీయాలు కూడా అవే. అయితే ఈ సారి మాత్రం ఓటుకు కోట్లు అవినీతి కేసు, నాలుగేళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌ని అథోగతివైపుగా నడిపించడం, 2014లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయిన నేపథ్యంలో బాబుకి పవన్, జెపిలాంటి వాళ్ళ సహాయం మరికాస్త ఎక్కువ అవసరమవుతోంది. ఈ మొత్తం డ్రామాను రక్తి కట్టించడానికి పచ్చ మీడియా నానా పాట్లూ పడుతోంది.

అయితే జెపి, పవన్‌ల పచ్చ డ్రామాలను మాత్రం ప్రతిపక్ష పార్టీ వైకాపా లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఈ బ్యాచ్‌కి ఇప్పుడు మోహన్‌బాబు నుంచి దిమ్మతిరిగిపోయే కౌంటర్ పడబోతోందని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కి సన్నిహితుడిగా జయప్రకాష్ నారాయణ ఉన్నప్పటి నుంచే మోహన్‌బాబుకు జెపికి సంబంధించిన అన్ని విషయాలూ తెలుసు. ఆ తర్వాత చంద్రబాబుతో కలిసిపోయిన విధానంతో తెరవెనుక వ్యవహారాలన్నీ చూసినవాడు మోహన్ బాబు. ఇక పవన్ కళ్యాణ్ తెరవెనుక వ్యవహారాలు….. తెర ముందు డ్రామాలపై కూడా మోహన్‌బాబు గొంతెత్తనున్నాడని తెలుస్తోంది. అలాగే గాయత్రి సినిమాలో చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన మోహన్‌బాబు ప్రజాక్షేత్రంలో కూడా నారా వారి రాజకీయ నాటకాలను ఉతికి ఆరేయనున్నాడని తెలుస్తోంది. అయితే మోహన్‌బాబు వైకాపాలో చేరతాడా? బిజెపిలో చేరతాడా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఏ పార్టీలోనూ చేరక ముందే ప్రజాక్షేత్రంలో పర్యటనలు చేసి నారావారి నాటకాలను ఎండగట్టి…..ప్రజా స్పందన మేరకు ఏ పార్టీలో చేరాలన్న నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో మోహన్‌బాబు ఉన్నాడని ఆయన ఆంతరంగికులు చెప్తున్నారు. డైలాగ్ కింగ్ మోహన్‌బాబు మాటలు చాలా సార్లు సంచలనం సృష్టించాయి. ఈ సారి మోహన్‌బాబు పొలిటికల్ ఎంట్రీ ఏ స్థాయిలో సెన్సేషన్ అవుతుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -