సీఎం జగన్ కు లోకేశ్ లేఖాస్త్రం

- Advertisement -

జగన్ సర్కార్ పై ప్రజావ్యతిరేక తీవ్ర స్థాయిలో ఉందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్. వైసీపీ నేతలు ఎక్కడికి వెళ్లినా జనం తిరుగుబాటు చేస్తున్నారన్నారు. అన్నదాతల ఆత్మహత్యకు కారణం మీరు కాదా అని అధికార పార్టీని నిలదీశారు. సీఎం జగన్ కు పలు ప్రశ్నలు సంధిస్తూ లేఖ రాశారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉండటానికి కారుకుడివి నీవు కాదా అని జగన్ను ప్రశ్నించారు.

వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టి.. రైతు మెడకు ఉరితాళ్ల బిగించిన నీచుడు ఎవరన్నారు ? ఇదంతా అప్పుల అనుమతి కోసం చేయడం లేదా అని నిలదీశారు. 12 వేల 700 రైతు భరోసా ఇస్తానని చెప్పి 7500 ఇస్తున్నది ఎవరని ప్రశ్నించారు.

కైలు రైతులను మీ ప్రభుత్వం అసలు గుర్తించిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. టీడీపీ హయాంలో రైతులకు 3 లక్షల వరకు సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చామనీ.. దాన్ని కేవలం లక్షకే పరిమితం చేసింది ఎవరని ప్రశ్నించారు. ఇలా పలు ప్రశ్నలు సంధిస్తూ లేఖ రాశారు.

అధికారంలోకి వస్తే కీలక నిర్ణయం తీసుకోబోతున్న కాంగ్రెస్

అమిత్ షా కాదు అబద్ధాల బాద్ షా

కేసీఆర్ కు నివేదిక ఇవ్వబోతున్న పీకే

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -