కేసీఆర్ కు నివేదిక ఇవ్వబోతున్న పీకే

- Advertisement -

దేశ రాజకీయాలకు సంబంధించి ప్రశాంత్ కిశోర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్నికల వ్యూహకర్తగా అనేక పార్టీల విజయం వెనుక ఉన్న పీకే .. స్వయంగా రాజకీయాల్లో వచ్చేందుకు ప్రయత్నించినా.. అవి పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. కాంగ్రెస్ లో చేరతారని కొంత కాలం కాదు సొంత పార్టీ పెడతారని మరికొంత కాలం ప్రచారం జరిగినా.. అలాంటిదేమీ లేదని తేలిపోయింది.

ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తో పీకేకు ఒప్పందం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రశాంత్ కిశోర్ ఈ నెల 18న భేటీ కానున్నారు. తెలంగాణ రాజకీయ సమీకరణాలకు సంబంధించి ఓ నివేదిక ఇవ్వనున్నారు.

- Advertisement -

ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉందో గుర్తించి.. అక్కడ గెలవాలంటే ఏం చేయాలో నివేదికలో వివరించనున్నారు. ఈ నెల 18న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం ప్రగతి భవన్ లోనే పీకేతో భేటీ అవుతారు.

ఏపీ మంత్రిపై అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు

ఒకే కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్

ప్రజల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -