Saturday, April 20, 2024
- Advertisement -

లోకేశ్ మాట్లాడితే అంతే…!

- Advertisement -

మంగళగిరిలో స్థానికంగా ప్రాబల్యం ఉన్న సామాజిక వర్గాన్ని పట్టించుకోకుండా తనకు సీటివ్వడంతో అక్కడ టీడీపీలో అసంతృప్తిని చల్లార్చడానికి వెళ్లిన చినబాబు తాను నోరు తెరిస్తే ఏం జరుగుతుందో జనానికి మరోసారి రుచి చూపించారు. మంగళగిరిలో 1980నుంచి టీడీపీ గెలవలేదని, తాను గెలుస్తానో లేదో ప్రజలే నిర్ణయిస్తారని సెలవిచ్చారు. ఇక్కడే అసలు ట్విస్టుంది. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే 1982వ సంవత్సరంలో అయినపుడు అంతకు రెండేళ్లు ముందుగానే ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం ఎలా సాధ్యం? అంటూ సోషల్ మీడియాలో జనం చినబాబును ఓ ఆట ఆడేసుకుంటున్నారు. 1982లో పుట్టిన పార్టీ 1980లోనే ఎలా గెలుస్తుందో మేధావి చినబాబే సెలవియ్యాలంటూ లోకేశ్ ను తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.

1982లో ఏర్పాటు చేసిన టీడీపీ 1980లోనే ఎందుకుంటుంది బాబూ? ఒక వేళ లోకేశ్ బాబును అడిగినా -ఎందుకుండదూ?.. ఉంటుంది- అని -బీకాంలో ఫిజిక్స్ మేధావి-లా సమాధామిస్తాడేమో.! మనవాడి మేధస్సు, పాండిత్యం, సామర్థ్యంపైన నమ్మకం లేకనే బాబుగారు తన పుత్రరత్నాన్ని ట్విట్టర్ కే పరిమితం
చేశారేమో!. ఏమైనా, చినబాబు జనంలోకి వచ్చి మాట్లాడితే ఏం జరుగుతుందో బాబుగారికి మరోసారి చక్కగా అర్థమైంది. ఇకపై ఎన్నికల ప్రచారంలో లోకేశ్ మంగళగిరి వాసులను, ఆంధ్రప్రదేశ్ జనాన్ని ఎలా అలరిస్తారో వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -