Saturday, April 20, 2024
- Advertisement -

పంజాబ్​ వివాదం కొలిక్కి.. సిద్దూకు పీసీసీ..!

- Advertisement -

గత కొంత కాలంగా పంజాబ్​ కాంగ్రెస్​లో అంతర్గత విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​.. కాంగ్రెస్​ నేత నవజ్యోత్​ సింగ్​ సిద్దూ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ పంచాయితీ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నది. అధిష్ఠానం ఎన్నో సార్లు సర్దిచెప్పినా వీరిద్దరి మధ్య గ్యాప్​ తగ్గడం లేదు. నవజ్యోత్​ సింగ్​ పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. అయితే ఆయనకు ఆ పదవి ఇస్తే.. పార్టీలో తన ఆధిపత్యం తగ్గుతుందని సీఎం అమరీందర్​ సింగ్​ భావిస్తున్నారట. దీంతో వీరిమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది.

ఈ క్రమంలో కాంగ్రెస్​ హైకమాండ్​ ఓ నిర్ణయానికి వచ్చింది. సిద్దూకు పీసీసీ ఇచ్చేందుకు కాంగ్రెస్​ అధిష్ఠానం ఒప్పుకున్నట్టు సమాచారం. ఇటీవల సిద్దూ ఢిల్లీ వెళ్లారు. ఆయన రాహుల్​గాంధీ, ప్రియాంకా గాంధీని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే రాహుల్​ గాంధీ అపాయింట్​మెంట్ ఇచ్చేందుకు నిరాకరించగా.. ప్రియాంకాగాంధీ సిద్దూకు అపాయింట్​మెంట్ ఇచ్చారు.

పంజాబ్​ రాజకీయ పరిస్థితులపై సిద్దూ .. ఆమెకు వివరించారట. అయితే సిద్దూకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్​ ఒప్పుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన రాహుల్​గాంధీని కూడా కలవబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సిద్దూకు పీసీసీ ఇవ్వడం.. సీఎం అమరీందర్​కు ససేమిరా ఇష్టం లేదు. ఈ క్రమంలో ఆయనను బుజ్జగించేందుకు హై కమాండ్​ చర్చలు జరపనున్నట్టు టాక్​. ఇటీవల దూకుడుగా ఉండే నేతలకే కాంగ్రెస్​ హైకమాండ్​ కీలక పదవులు కట్టబెడుతున్నది. అందులో భాగంగానే సిద్దూకు పీసీసీ దక్కినట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -