Friday, May 10, 2024
- Advertisement -

త్వ‌ర‌లో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం… ప్ర‌శాంత్ కిషోర్‌..

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉన్నా ఇప్ప‌టినుంచె పార్టీలు ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు . పార్టీల నాయ‌కులు ఇప్ప‌టినుంచె ప్ర‌జ‌ల‌ల్లోకి వెల్తున్నారు. టీడీపీ ఇంటింటికి టీడీపీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. నాయ‌కులంద‌రు ప్ర‌తి ఇంటికి వెల్లి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను వివ‌రించ నున్నారు. అదే రీతిలో వైసీపీ కూడా అన్న వ‌స్తున్నాడు పాయాత్ర‌ను జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు. పాద‌యాత్ర‌కు మందుగా వైఎస్ఆర్ కుంటుంబం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని పార్టీ వ్యూమ‌క‌ర్త‌గా పీకెను జ‌గ‌న్ నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. పార్టీ అభివృద్ధికోసం క్షేత్ర‌స్థాయిలో ప‌నులు మొద‌లు పెట్టారు. ఇప్ప‌టికె పార్టీ ప‌రిస్థితుల‌పై నివేదిక‌ల‌ను పీకె జ‌గ‌న్‌కు అందించారు. పార్టీ అధికారంలోకి రావాల‌ని దాన‌కి కావ‌ల్సిన వ్యూహాల‌ను సూచించాల‌ని ఇటీవ‌ల త‌మ పార్టీ రాజ‌కీయ నిపుణుడు ప్ర‌శాంత్ కిషోర్‌ని కోరిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈనెల 19న రాష్రానికి వ‌చ్చిన త‌ర్వాత పార్టీలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అధికారంలోకి రావాలంటె ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకోవాల‌ని పీకె సూచించారు. అంతేకాకుండా పార్టీకార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం ఏర్ప‌రిచి పార్టీ అభివృద్ధి కోసం ఓ కొత్త క‌మిటీని ఏర్పాటు చేసే యోచ‌న‌లో ఉన్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -