Wednesday, April 24, 2024
- Advertisement -

పవన్ నోట.. మళ్ళీ ప్రజారాజ్యం ప్రస్తావన !

- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంతో పోలిస్తే ప్రస్తుతం ఫుల్ యాక్టివ్ గా పాలిటిక్స్ లో దూసుకుపోతున్నారు. నిత్యం ఏదో ఒక రకంగా ప్రజల్లో ఉంటూ జనసేన పరిధిని విస్తరించుకుంటూ పోతున్నారు పవన్ కల్యాణ్. కౌలు రైతులకు ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనప్పటికి జనసేన మాత్రం అండగా ఉంటుందని ” కౌలు రైతు భరోసా యాత్ర ” ను చేపట్టారు పవన్. దీనికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇక తాజాగా సి‌ఎం జగన్ సొంత జిల్లా కడప లోని సిద్దవటంలో పరియటించిన ఆయన 175 మంది కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి, ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అధించారు. ఇక తదనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

వైసీపీ నేతలు తనకు కుల రాజకీయాలు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు.. జనసేన కుల పార్టీ కాదని ప్రజల పార్టీ అని వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలకు కొంతైనా అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. అయితే ఇలాంటి విమర్శలు జనంసేనాని తరచూ చేసేవే అయినప్పటికి.. తాజాగా మరోసారి ప్రజారాజ్యం ప్రస్తావనను ..తెరపైకి తేవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయించింది ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రులేనని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఇప్పుడు ఉండి ఉంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ” పవన్ అన్నారు.

అయితే పవన్ ఆయా సందర్భాలలో తన అన్నయ్యను గురించి ప్రస్తావించడం సహజమే.. కానీ ఈ సారి ప్రజారాజ్యం ప్రస్తావనను తెరపైకి తెచ్చారు.. అంతే కాకుండా ఆ పార్టీ విలీనం వెనుక ఉన్న వారు ఇప్పుడు మంత్రులుగా అధికారంలో ఉన్నారని ” అన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే పవన్ వారిని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఇక ప్రజారాజ్యం పార్టీ విలీనాన్ని పవన్ అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

Also Read: కే‌సి‌ఆర్ భయపడుతున్నారా.. భయపెడుతున్నారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -