Friday, May 10, 2024
- Advertisement -

ఫిరాయింపు ఎమ్మెల్యేకు ఘోర అవ‌మానం..

- Advertisement -

వైసీపీని బ‌ల‌హీనం చేయాల‌ని బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు చుక్కెదురు అవుతోంది. ఎన్నిక‌ల నాటికి సాధ్య‌మైనంగా ప్ర‌తిప‌క్ష పార్టీల ముఖ్య‌నాయ‌కుల్ని టీడీపీలోకి చేర్చుకోవాల‌న్న బాబు ఎత్తులు ఫ‌లించ‌ట్లేదు. ఇప్ప‌టికే ఆప‌రేష‌ణ్ ఆక‌ర్శ్ ద్వారా ఫిరాయించిన నేత‌ల‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. ప్ర‌జ‌ల‌నుంచి తీవ్ర‌త వ్య‌తిరేక‌త ఎదుర‌వుతుండ‌టంతో నేత‌లు ఏంచేయాలో దిక్కుతోచ‌న స్థితిలో ఉన్నారు.

తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేకు గిద్దలూరు మండలం సంజీవరావుపేటలో జరిగిన దళిత తేజం కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కి తీవ్రమైన అవమానం జరిగింది. పార్టీ బ‌లోపేతానికి అధిష్టానం ఇచ్చిన ఆప‌రేష‌ణ్ లీడ‌ర్ కార్య‌క్ర‌మంలో స్థానికుల‌నుంచి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది.

ఎమ్మెల్యే మాట్లాడబోగా దళిత మహిళలు అడ్డుకుని ఒక దళిత ఫీల్డ్ అసిస్టెంట్ ను అన్యాయం గా సస్పెండ్ చేయించా వంటూ నిలదీశారు. దళిత సర్పంచ్ పనులు చేయకుండా అడ్డుపడుతున్నావంటూ దూషణ లకు దిగారు. దీంతో ఎమ్మెల్యే వెనుతిరుగుతుండగా ఎన్నికల ప్పుడు వస్తే నీ అంతు తేలుస్తామంటూ చెప్పులు చూపించారు. ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా చాలా ఫిరాయింపు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే ప‌రిస్థితి ఎదుర‌వుతుండ‌టంతో ఒడ్డున ప‌డ్డ చేప‌లా గిల‌గిల కొట్టుకుంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో చాలా మంది ఫిరాయింపు నేత‌ల‌కు టికెట్టు ఇచ్చేది లేద‌ని ఇప్ప‌టికే చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దీనికి కార‌నం వారి నియోజ‌క వ‌ర్గాల్లో మ‌రో సారి గెలిచే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతోపాటు ప్ర‌జ‌ల‌నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌టంతో బాబు ఈనిర్ణ‌యం తీసుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రో సారి టికెట్ వ‌స్తాదా రాదో తెలియ‌ని ప‌రిస్థితి..మరోవైపు టికెట్ వ‌చ్చినా గెలుస్తామో లేదో అన్న డైల‌మాలో ప‌డ్డారు నేత‌లు. ఎందుకు త‌ల్లిలాంటి పార్టీని వ‌దిలి వ‌చ్చామ‌ని కుమిలిపోతున్నారు నేత‌లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -