Tuesday, April 30, 2024
- Advertisement -

గంటా శ్రీనివాస్ రావు నిర్ణయంతో సీఎం జగన్ హ్యాపీ ?

- Advertisement -

గంటా శ్రీనివాస్ రావు గురించి అందరికి తెలిసిందే. ఎన్ని పార్టీలు మారిన ఎన్ని నియోజికవర్గాలు మారిన ఆయన ఎక్కడ పోటీ చేస్తారో అక్కడ కచ్చితంగా గెలిచి తీరుతారనే పేరు ఉంది. ఒకసారి ఆయన అనకాపల్లి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వచ్చి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలవడంతో ఆ తర్వాత మంత్రిగా కూడా పని చేశారు.

రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడంతో మళ్లి టీడీపీలోకి వచ్చి 2014 ఎన్నికల్లో భీమినేని నుంచి పోటీ చేసి గెలిచి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఆయన గెలిచారు. కానీ ఆ తర్వాతి పరిస్థితుల్లో టీడీపీ ఎప్పుడైతే ఓడిపోయిందో ఆయన మాత్రం రాజకీయంగా ఎక్కువగా సైలెంట్ గా ఉండటానికే ప్రాధాన్యత ఇచ్చారు. గంటా మారిపోతారని.. పార్టీ నుంచి వెళ్లిపోతారని రకరకల వార్తలు వచ్చాయి. బీజేపీలోకి వెళ్తారని.. వైసీపీలోకి వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ గంట ఏటు కూడా వెళ్లకుండా టీడీపీలోనే ఉన్నారు.

అయితే రానున్న ఎన్నికల్లో గంటా గెలుపు పై ప్రశ్నల మీద ప్రశ్నలు వినపడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో గంట నియోజికవర్గం గనుక మారితే విశాఖ నార్త్ లో బీజేపీ నేత విష్ణుకుమార్ ను టీడీపీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న విష్ణు.. బీజేపీ తరుపున పోటీ చేసి విశాఖ నార్త్ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీలోకి రావడానికి ప్రయత్నించారు కానీ గంటా నార్త్ సీట్ లోకి రావడంతో మళ్లీ బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమిని చూశారు. ఈ సారి గంటా పార్టీ నుంచి వెళ్లిపోతున్నారనే పుకార్ల నేపథ్యంలో ఆయన సీటు మార్చే ఛాన్సెస్ ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన ఒక మంచి డిసిషన్ దిశగా అడుగులు వేస్తున్నారని త్వరలోనే పార్టీ మారే ఛాన్సెస్ కూడా ఉందని విశాఖలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ప్రస్తుతం పార్టీ మారి తన యోక్క నియోజికవర్గం ప్రజలకు మంచి చేసే దిశగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఆయన నియోజిక వర్గ ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటుండటంతో.. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ఫర్ఫెక్ట్ గా ఆమోదిస్తాం అన్నవారు లేకపోలేదు.

ప్రధానీ మోడీ ఆఫర్ ను జగన్ తిరస్కరించడానికి కారణం ఏంటి ?

సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన డీకే ఆరుణ..!

మిథున్ రెడ్డి అభినందిస్తే.. జగన్ కోపడ్డారు : రఘురామకృష్ణరాజు

వాక్సిన్ వచ్చేవరకు ఇలానే ఉంటుంది : జగన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -