Saturday, April 20, 2024
- Advertisement -

అర్ధం కానీ “రాహుల్ “.. కాంగ్రెస్ కు తప్పని తిప్పలు !

- Advertisement -

దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ఉనికిని కాపాడుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు జాతీయంగా తిరిగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు బలం చాటుకోవడానికి నానా తంటాలు పడుతోంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ పటిమ బలంగా ఉండేది. కానీ సోనియా గాంధీ తరువాత ఆ పార్టీని ముందుకు నడిపించే నాయకత్వం కోసం మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడంలో యువరాజు రాహుల్ గాంధీపైనే ఆధార పడ్డారు కాంగ్రెస్ నేతలు. అయితే ఎప్పటికప్పుడు వారి ఆశలపై రాహుల్ గాంధీ నీళ్ళు చల్లుతూనే ఉన్నాడు. గతంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి అధిష్టించిన రాహుల్.. కొన్ని రోజులకే ఆ పదవికి రాజీనామా చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

దీంతో రాహుల్ రాజకీయంగా పనికి రాడని, రాజకీయాలపై అతనికి అవగాహన లేదని ఇతర పార్టీల నుంచి బలంగా విమర్శలు ఎదురయ్యాయి. అంతే కాకుండా దురుసు వ్యాఖ్యలు చేయడం, ఆయా సందర్భాలలో రాహుల్ ప్రవర్తన ఇవ్వన్ని కూడా రాహుల్ కు రాజకీయాలపై అవగాహన లేదనే వాదనలకు బలం చేకూర్చాయి. ఇక తాజాగా మరో సారి రాహుల్ అధ్యక్ష పదవి విషయంలో కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ నెల 21 నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంభంధించి అన్నీ సన్నాహాలు పూర్తి చేసినట్లు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ తెలిపింది.

ఇక ఎన్నికల తేదీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ ముందస్తు ప్రకటించిన సమాచారం ప్రకారం ఈ నెల 21న అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణం రాహుల్ నుంచి స్పష్టమైన సంకేతాలు లేనందువల్లే అధ్యక్ష ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని వినికిడి. అయితే అధ్యక్ష పదవిపై రాహుల్ మొదటి నుంచి కూడా ఆసక్తిగా లేరన్నది జగమెరిగిన సత్యం. ఒకవేళ కాంగ్రెస్ అధ్యక్ష రేస్ లో రాహుల్ నిలవకపోతే.. అశోక్ గెహ్లాట్, మల్లికార్జున్ ఖర్గే, ముకుల్ వస్నిక్, కుమారి సెల్జా, సి.వేణుగోపాల్ వంటి వారు కాంగ్రెస్ అధ్యక్ష రేస్ లో ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి అర్దం కానీ రాహుల్ మనస్తత్వం వల్ల కాంగ్రెస్ కు తిప్పలు తప్పడం లేదు.

Also Read

జనసేనాని దారిలో చంద్రబాబు ?

నాగబాబు, అంబటి మద్య వార్

మరో చిక్కుల్లో నితీశ్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -