పవన్ దారిలో బాబు.. సక్సస్ అవుతాడా ?

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన, టీడీపీ పార్టీల పొత్తు విషయమై హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్నాయి. అయితే ఈ రెండు పార్టీల కలయిక గురించి అధినేతలు ఆచితూచి అగుడులు వేస్తున్నారు. ఇప్పటికే మోడీకి దగ్గరవుతున్న చంద్రబాబు.. బిజేపితో పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలను ఇస్తున్నారు. దీంతో బీజేపీ అనుకూల పార్టీ అయిన జనసేనతో కూడా పొత్తు ఉండే అవకాశం లేకపోలేదు. 2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

అయితే 2019 ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేసినప్పటికీ.. రాబోయే ఎన్నికల్లో.. మాత్రం మరోసారి ఈ మూడు పార్టీలు చేతులు కలుపుతాయనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం అలా ఉంచితే జనసేన దోస్తీ కోసం చంద్రబాబు నాయుడు ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు. పొత్తుల సంగతి అలా ఉంచితే.. ఒక్క విషయంలో మాత్రం పవన్ ను ఫాలో అవుతున్నారు చంద్రబాబు.. అదేమిటంటే పార్టీలో యువ రక్తాన్ని ఎక్కించడం.

జనసేన పార్టీ స్థాపించిన మొదటి నుంచి కూడా పార్టీలో సీనియర్స్ కంటే యువకులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు పవన్ కల్యాణ్. దాంతో రాబోయే రోజుల్లో యువత వల్ల పార్టీ మరింత బలపడుతుందని పవన్ ఆలోచన. ప్రస్తుతం పవన్ లాగే టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ లో యువతను ప్రోత్సహించే పనిలో పడ్డారు. టీడీపీ తొలినాళ్లలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా యువతకు పెద్దపీఠ వేశారు. అప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నేతల హడావిడి గట్టిగా ఉండేది. దాంతో సీనియర్లను ఎదుర్కొనేందుకు యువత కు టీడీపీ లో అధిక ప్రాధాన్యం ఇచ్చి కాంగ్రెస్ ను మట్టికరిపించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు. మరి ఆయన స్పూర్తితో ప్రస్తుతం బాబు కూడా యువతకు పెద్దపీఠ వేయబోతునట్లు పలు మార్లు స్పష్టం చేశారు.

Also Read

బాబు, జగన్.. నో కామెంట్స్ !

మోడీజీ గ్రేట్ !

ప్రియాంకా సౌత్ లో టేకాఫ్..టార్గెట్ తెలంగాణ ?

Related Articles

Most Populer

Recent Posts