Thursday, May 9, 2024
- Advertisement -

రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే వంగల రాజేశ్వరికి పచ్చ కండువా కప్పిన చంద్రబాబు….

- Advertisement -

చంద్ర‌బాబునాయుడు మొద‌లు పెట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్శ్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లు పెట్టే స‌మ‌యానికి మ‌రింత మంది నాయ‌కుల‌ను పార్టీలోకి చేర్చుకొని దెబ్బ‌కొట్టాల‌నె వ్యూహం ఫలిస్తోంది. ఇప్ప‌టికె వైసీపీనుంచి 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీ ఖండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందె.

అయితే తాజాగా జ‌గ‌న్‌కు మ‌రో బిగ్‌షాక్ ఇచ్చాడు చంద్ర‌బాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై రంపచోడవరం నుంచి పోటీచేసి విజయం సాధించిన వంతల రాజేశ్వరి, ఆ పార్టీ అధినేతకు షాకిస్తూ, పార్టీ ఫిరాయించారు. చంద్రబాబు వద్దకు వచ్చిన ఆమె, తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జ‌గ‌న్‌కు మ‌రో చావు దెబ్బ త‌గిలిన‌ట్లైంది.

నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను తెలుగుదేశంలో చేరినట్టు తెలిపారు. చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఆయన అడుగుజాడల్లో ఇకపై నడుస్తానని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైకాపా ఐదు స్థానాలను గెలుచుకోగా, ఇప్పటికే జ్యోతుల నెహ్రూ, పరుపుల సుబ్బారావు టీడీపీలో చేరిపోయారు. తాజాగా రాజేశ్వరి కూడా వారి వెంటే నడవడంతో, వైసీపీ బలం రెండుకు తగ్గింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆమెతో సహా ఇప్పటివరకూ 22 మంది టీడీపీలో చేరగా, మరో రెండు రోజుల్లో ఇంకో నలుగురైదుగురిని టీడీపీలోకి తీసుకొచ్చి, జగన్ ను నైతికంగా దెబ్బతీయాలన్నది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. ఇదంతా త‌న రాజకీయ గురువు జ్యోతుల నెహ్రూ సూచన మేరకే ఎమ్మెల్యే రాజేశ్వరి టీడీపీలో చేరుతున్నట్టు సమాచారం. ప్రతిపక్షంలో ఉండటం వల్ల నియోజకవర్గంలో పనులు జరగడం లేదని, అధికార పార్టీకి మారితే తప్ప అది సాధ్యం కాదని రాజేశ్వరి భావించినట్టు తెలుస్తోంది. ఇది నిజంగా జ‌గ‌న్‌కు పెద్ద‌షాకె అన‌క త‌ప్ప‌దు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -