- Advertisement -

కేసులు బనాయిస్తున్నారని ఆయన సైలెంట్ గా ఉన్నారా.?

- Advertisement -

జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ లో రెబల్ గా ఎదిగిన లీడర్.. తనకు నచ్చింది, నచ్చనిది నిర్మొహమాటంగా చెప్పే నాయకుడు. టీడీపీ ఓ స్థాయికి వెళతాడనుకున్న జేసీ ఎందుకు రాజకీయాలనుంచి హఠాత్తుగా తప్పుకుని అందరికి షాకిచ్చారు. తన వారసుల రాజకీయ అరంగేట్రం కోసమే తాను రాజకీయాలనుంచి తప్పుకున్నారని అయన పైకి చెప్తున్నా లోపల ఎదో ఉందని ఆయనను దగ్గర్నుంచి చుసిన వారు చెప్తున్నారు. జేసి దివాకర్ రెడ్డి ఎంత సౌమ్యుడో, అంతే మొండి వాడు కూడా, తనకు నచ్చే పని ప్రతిపక్ష లీడర్ చేసినా, తన కు నచ్చని పనిని సొంత పార్టీ అధినేత చేసినా దాన్ని జనాల్లో నిర్మొహమాటంగా చెప్పే ధైర్యమున్న లీడర్.. అలాంటి దివాకర్ రెడ్డి ఎందుకు రాజకీయాలకు దూరం గా ఉంటున్నాడో ఇంకా ఎవరికీ అర్థం కానీ విషయం.. ఆమధ్య ఓ స్వామిజి గొడవలో ఇరుక్కున్న సంఘటన తప్పా అయన పెద్దగా ఏ సీరియస్ వివాదాల్లోకి అయితే పోలేదు..టీడీపీ లో ఉంటూ చంద్రబాబు ను విమర్శించిన నేత ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క జేసీ దివాకర్ రెడ్డి అని చెప్పొచ్చు.

ఇక జగన్ ను కూడా అప్పుడప్పుడు విమర్శించినా ఎక్కువగా పొగుడుతుంటారు.. అయన రాజకీయాలకు దూరం గా ఉన్నారన్న మాటే కానీ రాజకీయాలపై ఎప్పుడు స్పందిస్తూనే ఉంటారు.. ఇటీవలే జగన్ పరిపాల సంవత్సర పూర్తయిన వేళా జగన్ పాలనా పై స్పందించి ఆయన పాలనకు వందకు వంద మార్కులు ఇచ్చారు. ఇది టీడీపీ వర్గాలకు రుచించకపోయినా అదే నిజం అని వారు మనసులో కూడా అనుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ప్రభుత్వంపై జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు చేస్తూ వచ్చినా సంవత్సరంలో ఇలా దివాకర్ రెడ్డి మాట మార్చడంతో జగన్ లో నాయకుడి ని చూసి ఆవిధంగా అన్నారని వైసీపీ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి.. ఇక ప్రభుత్వం వైఫల్యాల పైన ఆయన ఎక్కువ స్పందిస్తూ ప్రజా సంక్షేమం గురించి ఆలోచించారని చెప్పొచ్చు..  రివర్స్ టెండర్లపైనా, సంక్షేమ పధకాలపైనా జేసీ దివాకర్ రెడ్డి అనేక సార్లు సెటైర్లు వేశారు. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నా తన కుటుంబ సభ్యులందరూ ఓటమి పాలు కావడంతో జేసీ దివాకర్ రెడ్డ యాక్టివ్ గానే కన్పించారు.

ఓ దశలో జగన్ తో పోల్చుకుంటే చంద్రబాబు వేస్ట్ అని అర్థమొచ్చేలా అయన మాట్లాడారు.. చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలు వేస్ట్ అని, ఏ నేత గురించి మాట్లాడుతున్నారో అని చూడకుండా నిజం మాట్లాడేవారు కానీ రెండు నెలలుగా ఆయన సైలెంట్ గా ఉంటున్నారు.. తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని రవాణా శాఖలో అక్రమ రిజిస్ట్రేషన్ ల కేసులో అరెస్ట్ చేసినప్పటి నుంచి జేసీ దివాకర్ రెడ్డి బయటకు రావడం లేదు. అయితే సోదరుడు ఆ కేసులో ఉన్నదేమో అన్న డిప్రెషన్ కావొచ్చో ఏమో కానీ అయన మాత్రం దానిపై నోరు మెదపలేదు.. కరోనా వచ్చి ప్రజలు అల్లాడుతున్నా కూడా  ఆయన మౌనంగా ఉన్నారు. తమ కుటుంబ సభ్యులపై వరస కేసులు నమోదవ్వడంతో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యలకు కూడా ఇదే ఆయన సూచించినట్లు తెలిసింది. మరో నాలుగేల్లు నోర్మూసు కూర్చోవడమే బెటర్ అని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన వద్దని కుటుంబ సభ్యులను జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరించినట్లు తెలిసింది. జేసీ కుటుంబం ఎక్కడ ఆ కేసులు తమ మీదకు వస్తాయో అని పూర్తి సైలెంట్ అయిందంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -