Saturday, April 20, 2024
- Advertisement -

లూసిఫర్​ రీమేక్​ సరే.. కానీ దర్శకుడే తేలడం లేదు..!

- Advertisement -

రాజకీయాల నుంచి బయటకొచ్చిన అనంతరం చిరంజీవి ఆచీ తూచీ సినిమాలు చేస్తున్నాడు. రీ ఎంట్రీ తొలి సినిమా ఖైదీ నంబర్​ 150 భారీ విజయం సాధించింది. ఈ మూవీ కూడా రీమేకే.. ఆ తర్వాత తన చిరకాల కోరిక అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సైరాలో నటించాడు. అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత లూసిఫర్​ అనే మరో రీమేక్​లో చిరంజీవి నటించబోతున్నాడు. కానీ ఈ సినిమాకు దర్శకుడిగా ఎవరిని పెట్టాలని అనే విషయం ఇంకా తేలడం లేదు.

మలయాళ చిత్రం లూసిఫర్​ ఎంతో నచ్చడంతో దాన్ని తెలుగులోకి రీమేక్​ చేయాలని చిరంజీవి భావించాడు. అయితే దర్శకుడి ఎంపికలోనే జాప్యం జరుగుతోంది. తొలుత సుజిత్​ను అనుకున్నారు. ఆ తర్వాత వినాయక్​ను పెట్టుకుందామనుకున్నారు. ఆ తర్వాత తమిళ దర్శకుడు మోహన్​రాజా చేతిలో ప్రాజెక్ట్ పెట్టాడు. కానీ ఫైనల్ స్క్రిప్ట్ అంత సంతృప్తికరంగా లేదని సమాచారం. దీంతో ఇప్పటివరకు ఏ డైరెక్టర్ ను ఫైనల్​ చేయలేదని టాక్.

లూసిఫర్​ ఇప్పటికే డబ్ కావడంతో కథలో చాలా మార్పులు చేయాలని చిరంజీవి భావిస్తున్నాడట. ఇందుకోసం ఇప్పటికే పలువురు రచయితలతో ఆయన చర్చలు జరుపుతున్నారట. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు, క్లైమాక్స్​ విషయంలో చాలా మార్పులు చేయాలని చిరంజీవి అనుకుంటున్నారట. అందుకనే ఈ మూవీ విషయంలో క్లారిటీ రావడం లేదని సమాచారం. మొత్తానికి ఈ మూవీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ దర్శకుడు ఎవరు? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు.

Also Read

హరీశ్​ శంకర్​ – పవర్​స్టార్​ సినిమా ఎలా ఉండబోతుందంటే?

కేజీఎఫ్ రూట్ లోనే సలార్ కూడా…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -