విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఏపీకి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే విశాఖ వెళ్లి మద్దతు తెలుపుతామని వెల్లడించారు. అవసరమైతే కేసీఆర్ ఆనుమతితో వైజాగ్ వెళ్లి ప్రత్యక్షంగా వారి పోరాటానికి మద్దతు తెలియజేస్తాం. ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమం.. మనకెందుకులే అనుకుంటే రేపు మన దగ్గరకు వస్తారు.
ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతున్నారు.. రేపు బీహెచ్‌ఈఎల్ అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటు పరం చేయండి అంటారు. ఏమైనా చేస్తారు. ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తాం అన్నారు. దాంతో విశాఖ లో ప్రతి పౌరుడు కేటీఆర్ పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
విశాఖ ఉక్కు పోరాటానికి కేటీఆర్ మద్దతివ్వటం వెనుక దురుద్దేశముందని.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కోసమే టి.ఆర్.ఎస్ ఈ ఎత్తుగడ వేసిందని విమర్శించారు. విభజన హమీలపై పోరాడలేరుగానీ.. విశాఖ ఉక్కు కోసం పోరాడతారా? అని ప్రశ్నించారు.
ఈ మేరకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై పోరాటానికి కలిసి రావట్లేదన్నారు. పార్లమెంట్‌లో పోరాటానికి టి.ఆర్.ఎస్ ఎంపీలు మొహం చాటేశారని దుయ్యబట్టారు. మోదీ అంటే భయపడుతున్నారా లేదా రాజీ పడుతున్నారా? అని లేఖలో నిలదీశారు. టి.ఆర్.ఎస్ నేతలు గల్లీలో చెప్పే మాటలకు… దిల్లీలో చేతలకు పొంతన కుదరట్లేదని రేవంత్ అనుమానం వ్యక్తంచేశారు.
‘సారంగ దరియా’ వివాదం.. శేఖర్ కమ్ముల ఏమన్నారో తెలుసా?
