చంద్రబాబుకు సజ్జల కౌంటర్

- Advertisement -

చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓటీఎస్ ద్వారా ప్రజలకు ఎలాంటి నష్టం జరగదన్నారు. పేదలకు సీఎం జగన్ ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని తెలిపారు. ఓటీఎస్‌పై ప్రజలు తిరగబడాలని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రుణంపై ఉన్న వడ్డీని మాఫీ చేయాలని కోరినా చేయలేదని ఆయన గుర్తు చేశారు. ఓటిఎస్‌తో పేదవాళ్ల ఇళ్లు వారి వారసులకు రిస్ట్రేషన్ చేసే అవకాశం లభించిందన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా తాము ఇళ్ల రిజిస్ట్రేషన్లను పక్కాగా అమలు చేస్తున్నామన్నారు.

- Advertisement -

ఉద్యోగులను ఎవ్వరూ బానిసలుగా మార్చుకోలేదన్న సజ్జలా.. ఉద్యోగులు ప్రజల్లో, ప్రభుత్వంలో బాగమన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలను వాటి వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవారే ఉద్యోగులని సజ్జల తెలిపారు. చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్న ఆయనా… బాబు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

వైసీపీ ఆటలు సాగవు అంటున్న చంద్రబాబు

చంద్రబాబు పై మరోసారి ఫైర్ అయిన అంబటి

అయోమయంలో అన్నదాతలు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -