Sunday, May 5, 2024
- Advertisement -

శశికళ సంచలన ప్రకటన

- Advertisement -

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత స్నేహితురాలు శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె నిర్ణయంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. వివరాల్లోకెళ్తే.. ఆస్తుల కేసులో అరెస్టయిన జయలలిత ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి జయలలిత పార్టీ అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకురావ‌డానికి కృషి చేస్తార‌ని అంద‌రూ భావించారు.

కానీ తాజాగా శ‌శిక‌ళ తీసుకున్న నిర్ణ‌యం షాక్‌లో ప‌డేసింది. అదే.. శ‌శిక‌ళ ఇక నుంచి పూర్తిగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుటుంన్న‌ట్టు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇదే విష‌యాన్ని తాజాగా మీడియాకు వెల్ల‌డించింది. అలాగే, జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల గురించి కూడా ఆమె ప్ర‌స్తావించింది. అన్నా డీఎంకే శ్రేణులు ఐక్యంగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ముందుకు సాగాల‌ని తెలిపింది.

“నా స్నేహితురాలు జ‌య‌ల‌లిత బతికున్నప్పుడు కూడా నేను ఎలాంటి పదవుల్లో లేను. ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప‌ద‌వుల్లో కొన‌సాగ‌లేదు. జ‌య‌ చనిపోయిన తర్వాత కూడా అధికారం చేపట్టాలనీ, పదవిని అధిష్ఠించాలని కోరుకోలేదు” అని శ‌శిక‌ళ వెల్ల‌డించారు. అలాగే, “ఇప్పుడు నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను. జ‌య పార్టీ గెలవాలని కోరుకుంటున్నాను” అని ఆమె పేర్కొన్నారు.

‘సత్యమేవ జయతే..’ అంటూ అద‌ర‌గొడుతున్న ప‌వ‌న్

అప్పుల్లో నాల్గో స్థానంలో ఏపీ

రెక్వెస్ట్ కాదు.. వార్నింగ్ : బండి సంజయ్

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -