Sunday, May 5, 2024
- Advertisement -

టీడీపీకి షాక్‌.. ఎస్ఈసీ నోటీసులు!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నిర్వాకంపై ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న్ స్పందించింది. పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ మేనిఫెస్టో విడుద‌ల చేయ‌డంపై వివ‌ర‌ణ అడిగింది. దీనికి సంబంధించి శనివారం నోటీసులు జారీ చేసింది. ‌మంగ‌ళ‌వారం లోపు ఈ విష‌యంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని గ‌డువు విధించింది.

కాగా పల్లె ప్ర‌గ‌తికి పంచ‌సూత్రాలు అంటూ పంచాయ‌తి ఎన్నిక‌ల‌ను ద్రుష్టిలో పెట్టుకుని చంద్ర‌బాబు గురువారం ఓ మేనిఫెస్టోను విడుద‌ల చేశారు. పార్టీ ప్ర‌స్తావ‌న లేకుండా జ‌రిగే ఈ ఎల‌క్ష‌న్‌లో బాబు వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదాస్ప‌ద‌మైంది. దీంతో ఆయ‌న‌తో పాటు ఆయ‌న‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌కు కొత్త చిక్కు వ‌చ్చి ప‌డింది.

ఈ క్ర‌మంలో అధికార వైఎస్సార్ సీపీ నేత‌లు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించార‌ని, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ విష‌యంపై స్పందించిన ఎస్ఈసీ శ‌నివారం టీడీపీకి నోటీసులు ఇచ్చింది. వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది.

మొసలితో పరాచకాలు.. చివరికి ఏం జరిగిందంటే?

బాడీనే కాదు బుర్ర కూడా ఉండాలనేది అందుకే!

విజయనగరంలో టీడీపీకి భారీ షాక్!

చంద్ర‌బాబు చేసిన ప‌నితో ఎస్ఈసీకి ఇబ్బందులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -