Friday, March 29, 2024
- Advertisement -

గువ్వల ఎక్కడ..? రాజీనామా ఎప్పుడు..?

- Advertisement -

అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అంటే తెలియనివారంటూ ఉండరు. హజురాబాద్ ఎన్నికల్లో గాంభీర్యం ప్రదర్శించి ఆయన చేసిన హడావుడీ అంతా.. ఇంతా కాదు. ఎన్నికల్లో ఈటల ఓటమి కాయమన్న బాలరాజు.. అధిష్టానం పిలుపునిచ్చిన మహాధర్నాలో ఎందుకు పాల్గొనలేదు ? ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు.

గువ్వల బాలరాజు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యిపన్నటికీ హుజూరాబాద్ బై పోల్స్‎కు ముందు ఆయన సోషల్ మీడియాలో పార్టీ అగ్ర నేతగా చెలామని చేశారు. ఈటల రాజేందర్ గెలుస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దీంతో అప్పట్లో గువ్వల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపీగ్‎గా మారాయి.

హుజూరాబాద్ బైపోల్స్ రిజల్ట్ రాగానే తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఈటల గెలుస్తే తన పదవికి రాజీ నామా చేస్తానన్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. తన పదవికి రాజీనామా ఎప్పుడు చేస్తారో చెప్పాలని తెగ ట్రోల్ చేశారు. దీంతో ఎమ్మెల్యే గువ్వల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎన్నికల ముందు రాజీనామా చేస్తానని సవాల్ చేసినందుకే ఆయన కన్పించకుడా తిరుగుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ బీజేపీ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మహా ధర్నాకు పిలుపు నివ్వగా.. ఆ ధర్నాలో కూడా బాలరాజు పాల్గొనలేదు. దీంతో సోషల్ మీడియాకు భయపడే గువ్వల ధర్నాలో పాల్గొనలేదనే పుకార్లు శికార్లు చేస్తున్నాయి. మరో వైపు మహా ధర్నాలో పాల్గొన్న అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్, ఎంపీపీలు సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. నిజాలు తెలుసుకోకుండా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. దీంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది.

ఎన్నికల ముందు పులిలా మాట్లాడిన ఎమ్మెల్యే బాలరాజు.. ఇప్పుడు పిల్లిలా మారారనే ప్రచారం వినిపిస్తుంది. ఆయన బయటకు వస్తే రాజీనామా ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తారనే భయంతోనే మీడియాకు కన్పించకుండా తిరుగుతున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

జగన్ పై ఉద్యోగుల పోరాటమా..

లవరం నిర్వాసితుల ప్యాకేజీలో అక్రమాల పాపం ఎవ్వరిది..?

అమరావతి రైతులపై లాఠీ ఛార్జ్ వెనుక ఉన్నదెవరు..?

కేసీఆర్ కు ఆడవారి గండం ఉంది..

-Ramesh Reddy Chilakala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -