Saturday, April 20, 2024
- Advertisement -

అమరావతి రైతులపై లాఠీ ఛార్జ్ వెనుక ఉన్నదెవరు..?

- Advertisement -

అమరావతి రైతుల నిరసన కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదా ? రాజదాని రైతుల పాదయాత్రపై జగన్ కక్ష పెంచుకున్నారా? అమరావతి రైతులపై ఎందుకు ఇంత అక్కస్సు.. రైతులపై లాఠీ ఛార్జ్ వెనుక ఉన్నదెవరు. అమరావతి రైతులపై లాఠీ విరిగింది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాధనకు వ్యతిరేకంగా రాజధాని రైతులు గత కొన్నిరోజులుగా నిరసన ప్రదర్శన చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నా.. తమ వైఖరిపై ప్రభుత్వం మారకపోండతో రైతులు పాదయాత్రకు సిద్ధమయ్యారు.

నవంబర్ 1 నుంచి మహా పాదయాత్రను ప్రారంభించిన రైతులు.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలని, ప్రభుత్వం భూదందాకు దిగిందని, అందులో భాగంగానే ఎగ్జిగ్యూటీవ్ రాజధానిగా విశాఖను ప్రకటించిందన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ రాజధాని రైతులు మహా పాదయాద్ర కొనసాగిస్తున్నారు.

మహా పాదయాత్ర ప్రకాశం జిల్లాలోని మద్దిరాలపాడుకు చేరుకోవడంతో పాదయాత్రలో టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. రాజధాని రైతుల యాత్రల్లో స్థానికులు పాల్గొని మద్దతు తెలపుతుండటంతో.. ఓర్వలేకపోయిన వైసీపీ ప్రభుత్వం రైతులపై దాడికి దిగింది. అమరావతి రైతులు జిల్లాలోని నాగులుప్పలపాడు చేరుకోగానే భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమను ఎంతుకు అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా యాత్ర చేస్తుంటే ఎలా అడ్డుకుంటారని రైతులు ప్రశ్నించారు. దీంతో పోలీసులు ఎలాంటి కారణం లేకుండానే పోలీసులు రైతులపై లాఠీ లేపారు. దీంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న నాగులుప్పలపాడు ప్రాంతం ఒక్కసారిగా రైతుల అరుపులతో దద్దరిల్లింది. పోలీసుల లాఠీ చార్జిలో పలువురు రైతులకు గాయాలయ్యాయి.

రాజధాని రైతులు ప్రశాంతంగా పాదయాత్ర చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని, వారి యాత్రను అడ్డుకోవడాలని చూస్తున్నారని, అందులో భాగంగానే యాత్ర చేస్తున్న రైతులపై లాఠీ చార్జ్ చేయించారని పలువురు రాజకీయ విశ్లేషకులు జగన్‎పై మండి పడుతున్నారు. జగన్ చేతనైతే రైతుల మనస్సును మార్చాలి.. అంతే కాని రైతులపై దాడులు చేయడం ఏంటని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఎపి లో ఎవరు సుఖంగా లేరా..!!

తెలంగాణలో రాజకీయం ఇక రసవత్తరం..‌

అల్లు వారు ఎంత‌కాలం మెగా ప‌ల్ల‌కీ మోయాలి..

-Ramesh Reddy Chilakala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -