Friday, March 29, 2024
- Advertisement -

పోలవరం నిర్వాసితుల ప్యాకేజీలో అక్రమాల పాపం ఎవ్వరిది..?

- Advertisement -

పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం ప్యాకేజీ చెల్లించిందా ? పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పేరు గ్రామంలో 5 కోట్లను రెవన్యూ అధికారులు ఏం చేశారు. బాధితులకు సరైన న్యాయం జరిగిందా.. పోలవరం ఆర్అండ్‎ఆర్ ప్యాకేజీలో ఎలాంటి అవకతవకలు జరిగాయి. పోలవరం నిర్వాసితులకు చెల్లించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో అక్రమాలు తవ్వేకొద్ది బయటపడుతున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లా కుక్కనూరు మండల పరిధిలోని ఉప్పేరు గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్లప్పగూడెంకు చెందినమడెం బోడయ్య 172,66, 25 సర్వే నెంబర్ లోని 5 ఎకురాల భూమిలో ఆర్అండ్‎ఆర్ పుణరావాస కాలనీ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. సర్వే అనంతనం ఓ రెవెన్యూ అధికారి వచ్చి అధికారులు భూమి పట్టా, పాసు పుస్తకాల జిరాక్స్ లు అడిగారని తెలుపడంతో రైతు బోడయ్య పాస్ పుస్తకాల జిరాక్స్ ఇచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి తమకు పరిహారం రాకపోవడంతో.. రైతు ఎంక్వైరీ చేయగా 172, 66, 25 సర్వే నెంబర్‎లో ఉన్న భూములకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించందని తేలిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

దీంతో ఉన్నతాధికారులను ఆశ్రయించిన రైతు.. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. నకిలీ రసీదులు సృష్టించిన వీఆర్ఏ రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. రాంబాబు అవినీతి బయటకు రావడంతో అప్పట్లో ఐటిడిఎ పివోగా విధులు నిర్వహించిన హరియాంధ్ర ప్రసాద్.. అధికారి విఆర్ఏ రాంబాబును సస్పెండ్ చేసి ప్రభుత్వాన్ని మోసం చేసి అక్రమంగా పొందిన భూ పరిహారాన్ని ప్రభుత్వానికి చెల్లించాలని నోటీసులు అందజేశారు.

పోలవరం నిర్వహితులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ అధికారులు వాటిని కాజేస్తున్నారు.. దీంతో రైతులు నష్టపోతునారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

అమరావతి రైతులపై లాఠీ ఛార్జ్ వెనుక ఉన్నదెవరు..?

ఎపి లో ఎవరు సుఖంగా లేరా..!!

నాని సినిమాకు బిజినెస్ కష్టాలు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -