- Advertisement -

ఓటుకు కోట్లుః ఏం చేద్దాం? ప్రజలకేం చెప్దాం?…… సన్నిహితులతో బాబు వరుస మంతనాలు

- Advertisement -

మట్టి, ఇసుకు నుంచీ ప్రాజెక్టుల వరకూ అడ్డంగా అక్రమాలు, అవినీతికి పాల్పడిన వ్యవహారాలకు పాల్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్ ఒన్ అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దిన వ్యవహారాలపై భారతీయ జనతా పార్టీ ఎక్కడ విచారణ చేయిస్తుందో అని అనుక్షణం భయపడుతూ ………ఏమీ జరగకముందే భుజాలు తడుముకుంటూ బిజెపి కక్ష్య సాధింపు అని గగ్గోలు పెట్టిన బాబు అండ్ కో కు ఊహించని షాక్ ఇచ్చాడు కెసీఆర్. కెసీఆర్ దెబ్బకు చంద్రబాబుతో సహా పచ్చ బ్యాచ్ మొత్తానికి మైండ్ బ్లాంక్ అయిన పరిస్థితి.

అందుకే బాబు వందిమాగధుల్లాంటి మీడియా పెద్దలు, సన్నిహితులైన న్యాయ నిపుణులు, వ్యూహకర్తలతో చంద్రబాబు వరుసగా మంతనాలు జరుపుతున్నాడు. కెసీఆర్ భుజాలపై నుంచి తుపాకి పెట్టి తనను కాల్చే ప్రయత్నం చేస్తోంది అన్న ప్రచారాన్ని జనంలోకి పంపిద్దామన్న ఆలోచన గొప్పగా ఉందని అందరూ అభిప్రాయపడ్డారు కానీ జనాలు నమ్మే అవకాశం లేదేమో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. బిజెపి, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో రాజకీయాలు చేస్తున్న కెసీఆర్‌తో బిజెపి కుమ్మక్కయిందని ఎంత ప్రచారం చేసినా జనాలు నమ్మరన్న అభిప్రాయం వ్యక్తమైందట. ఇక కెసీఆర్ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ అంటూ కేసులు పెడదామన్నా గెలవడం కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఓటుకు కోట్లు కేసులో వ్యూహం రచించడం, బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్ బాబుదే అవ్వడంలాంటి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్న నేపథ్యంలో ప్రజల మధ్యన తేల్చుకోవడం కంటే కెసీఆర్‌తో లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకుంటేనే బెటర్ అన్న అభిప్రాయానికి అందరూ వచ్చారని తెలుస్తోంది. పచ్చ బ్యాచ్ పాట్ల విషయం పక్కనపెడితే కెసీఆర్ మాత్రం రైట్ టైంలో మరోసారి చంద్రబాబును అడ్డంగా బుక్ చేశాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. ఇక ఈ ఓటుకు కోట్లు వ్యవహారంలో కెసీఆర్ ఎంతవరకూ వెళతాడో చూడాలి మరి. స్పష్టమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో కెసీఆర్ వెనక్కితగ్గకపోతే మాత్రం చంద్రబాబుతో సహా అందరికీ కష్టాలు తప్పవు అన్నది న్యాయనిపుణుల అభిప్రాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -