జూనియ‌ర్ ప్ర‌చారానికి రాక‌పోవ‌డానికి బాల‌య్య కార‌ణ‌మా..?

- Advertisement -

తెలంగాణాలో ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ, మహాకూటమిలు జోరుగా ప్రచారం చేశాయి. కూట‌మిలో భాగంగా కూక‌ట్ ప‌ల్లినుంచి టీడీపీ త‌రుపున నంద‌మూరి సుహాసినిని చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా బ‌రిలోకి దింపారు. దీనికి ప్ర‌ధానం కార‌ణం సుహాసిని త‌రుపున జూ.ఎన్టీఆర్ ప్ర‌చారం చేస్తార‌ని బాబు పెట్టుకున్న ఆశ‌ల‌కు గండి కొట్టారు జూనియ‌ర్. మా అక్క‌ను గెలిపించండంటూ ఒక ట్వీట్ చేసి ఊరుకున్నారు.

నందమూరి సుహాసిని తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడం నందమూరి ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరిచింది. అనేక రూమర్లకు కూడా ఇది ఆస్కారం కల్పించింది. మరి ఇంతకూ టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడానికి కారణం బాలయ్యేనట.

- Advertisement -

ఎన్టీఆర్‌‌‌‌కు ప్రచారాలు కలిసి రాలేదనే కారణంతో బాలకృష్ణే ఆయన్ను వారించారట. అంతే కాకుండా ఓ పార్టీ తరఫున ప్రచారం చేస్తే.. కొందరికి నచ్చకపోవచ్చు. ఇది ఎన్టీఆర్ కెరీర్‌పై ప్రభావం చూపే ఛాన్స్ ఉండటంతో ప్రచారం చేయొద్దని చెప్పారట. ‘తారక్ నా అన్న కొడుకే కాదు.. నాకు కూడా కొడుకే. అందుకే ప్రచారానికి రానివ్వలేదు. మోక్షజ్ఞ ఎందుకు ప్రచారానికి రాలేదో.. ఎన్టీఆర్ కూడా అందుకే రాలేద’ని బాలయ్య వివరణ ఇచ్చాడట. దీనిలో ఎంత నిజ‌ముందో ఆ దేవుడికే తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -