Monday, May 6, 2024
- Advertisement -

దేవుడా…… వైకాపాకు మైలేజ్ రాకూడదన్న కుట్రతో టిడిపి ఎంపిల డ్రామా?

- Advertisement -

నాలుగేళ్ళుగా బిజెపితో కలిసి ఉంటూ అన్ని ప్రయోజనాలూ పొందాడు చంద్రబాబు. ఎన్నికల ఏడాదిలో మేల్కొన్నాను అన్నాడు. కానీ అది కూడా అబద్ధం అని తెలిసిపోతూనే ఉంది. కేవలం వైఎస్ జగన్‌కి ప్రజల్లో ఎక్కడ పేరు వస్తుందో అన్న భయంతో నాటకాలు ఆడడం తప్పితే చంద్రబాబు చిత్తశుద్ధి మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైకాపా ఎంపిలు రాజీనామా చేశారు. చచ్చేవరకూ పదవులు పట్టుకుని వేలాడడం, సవాలక్ష అబద్ధాలు చెప్పి అయినా అధికారంలోకి రావాలనుకునే నాయకులున్న నేపథ్యంలో పదవులను త్యజిస్తూ ఎవరు రాజీనామాలు చేసినా అభినందించాల్సిందే. అలాగే నాయకుడంటేనే స్వార్థపరుడు అని ప్రజలు భావించేలా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నిరాహారదీక్ష చేయడం కూడా అభినందించాల్సిన విషయమే. కనీసం రాజీనామా చేసిన ఎంపిల త్యాగం, నిరాహార దీక్ష చేస్తున్న ఎంపిల పట్ల జాతీయ స్థాయిలో వస్తున్న స్పందనను అయినా గౌరవించాల్సిందే. ఆ రకంగా చేస్తే కనీసం మోడీపై ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంది.

కానీ చంద్రబాబు మాత్రం మరోలా ఆలోచించాడు. వైకాపా ఎంపిలు రాజీనామాలు చేసిన విషయం అసలు ప్రజలకు తెలియనే తెలియకూడదు అనుకున్నాడు. ఇక వైఎస్ విజయమ్మ నిరాహార దీక్ష చేస్తున్న వైకాపా ఎంపిల శిబిరాన్ని సందర్శించడానికి వెళ్తే ఆ విషయం మీడియాలో కనిపించకుండా చేయాలనుకున్నాడు. టిడిపి ఎంపిల చేత చిన్న సైజ్ వీధినాటకం ఆడించాడు. భజన మీడియాలో మోడీ ఇంటి ఎదురుగా టిడిపి ఎంపిల వీరోచిత పోరాటం అంటూ వస్తున్న వీధినాటం తాలూకూ అసలు రంగును ఇప్పుడు జాతీయ మీడియా బయటపెట్టేసింది.

టిడిపి ఎంపిలు మోడీ ఇంటికి బయల్దేరినప్పుడే పోలీసులకు సమాచారం అందించారు. మోడీ ఇంటికి కిలో మీటర్ దూరంలోనే అందరూ అరెస్ట్ అయిపోయారు. ఈ వ్యవహారం అంతా కూడా కేవలం ఐదు నిమిషాల్లో ముగిసిపోయింది. ఇక ఐదు నిమిషాల వీధినాటకాన్ని టిడిపి అధినేత చంద్రబాబుతో సహా ఆయన భజన బృందం మొత్తం కూడా మూడో ప్రపంచ యుద్ధం చేసిన టిడిపి ఎంపిలు అనే స్థాయిలో ప్రచారం చేశారు. కానీ జాతీయ మీడియా మాత్రం అసలు విషయం చెప్పేసింది. రాజీనామా చేసి నిరాహారదీక్షలు చేస్తున్న వైకాపా ఎంపిలకు ఎక్కడ మైలేజ్ వస్తుందో అన్న భయంతో టిడిపి ఎంపిలు కేవలం ఐదు నిమిషాలపాటు డ్రామా ఆడారని అంతకుమించి వాళ్ళు చేసింది ఏమీలేదని నేషనల్ మీడియా తేల్చేసింది. చంద్రబాబు సారథ్యంలో ఢిల్లీ స్థాయిలో టిడిపి ఎంపిలు చేసిన కామెడీ పోరాటకంతో అలా మరోసారి తెలుగు వాళ్ళ పరువు పోయిందని ఢిల్లీలో ఉన్న తెలుగు సీనియర్ జర్నలిస్టులు వాపోతూ ఉండడం ఈ మొత్తం ఎపిసోడ్‌కి హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -