Friday, April 26, 2024
- Advertisement -

చంద్ర‌బాబుకు జూనియ‌ర్ ఎన్టీర్‌ షాక్‌..?

- Advertisement -

ఎవ‌రినైనా త‌న అవ‌స‌రాల కోసం వాడ‌కంలో చంద్ర‌బాబును మించిన వారు ఎవ‌రూలేరు. ఇది అంద‌రికీ తెలిసిందే. ఎన్టీఆర్ నుంచి పార్టీ ని లాక్కొని వారి కుటుంబ సభ్యలను వాడుకొనే తీరు చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను త‌న రాజ‌కీయ అవ‌స‌రాల‌కోసం వాడుకొని అవ‌స‌రం తీరాక దూరం పెట్టారు.

అయితే ఇప్పుడు మ‌రో సారి వాడ‌కానికి తెర‌లేపారు. మ‌హాకూటమిలో భాగంగా కూక‌ట్ ప‌ల్లి సీటు టీడీపీకీ ద‌క్కింది. అక్క‌డ‌నుంచి నంద‌మూరి హ‌రికృష్ణ కూత‌రు సుభాషినిని బ‌రిలోకి దింపారు. దీంతో ఆమె త‌రుపున అన్న‌లు జూ.ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్ ప్ర‌చారం చేస్తార‌ని బాబు వ్యూహాత్మ‌కంగా ముందుకెల్తున్నారు.

బాబు అనుకున్న ది ఒక్క‌టి అయితే మ‌రో క‌టి జ‌రిగింది. ఎన్నిక‌ల ప్ర‌చారంవిష‌యంలో బాబుకు ఎన్టీఆర్ షాక్ ఇచ్చార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నారు. హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరు పైకి వచ్చిన తరువాత నుంచి అధికారికంగా ప్రకటించే వరకు ఒక్కటంటే ఒక్క ఫోన్ కాలు చంద్రబాబు నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ కీలక బాధ్యుల నుంచి కానీ హరికృష్ణ కుటుంబసభ్యులు ఎవరికీ రాలేదన్నది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కేవలం నేరుగా సుహాసినిని, ఆమె దగ్గర వారు మరి కొందరిని సంప్రదించి బాబు ఈ నిర్ణయానికి వారిని ఒప్పించినట్లు తెలుస్తోంది. చంధ్రబాబు ఇలా చేయడం వల్ల హరికృష్ణ కుటుంబ సభ్యులు ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ పైకి ఏమీ మాట్లాడకుండా వుండిపోయినా, జరుగుతున్నది చూస్తూ, ఇంత రాజకీయమా? అని బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

మరి ఇలాంటి నేపథ్యంలో సోదరి కోసం కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ప్రచారానికి వస్తారా? అన్నది అనుమానంగా వుంది. కేవలం కూకట్ పల్లిలో కమ్మ సామాజికవర్గానికి టికెట్ ఇవ్వాలనే వత్తిడి రావడంతో, మరెవరికి ఇచ్చినా పెద్దిరెడ్డి, తదితర ఆశావహులతో సమస్య వస్తుందని, ఈ విధంగా బహుళార్థకసాధక ఎత్తుగడ వేసినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బాబు సంగ‌తి తెలుసు కాబ‌ట్టి ప్ర‌చారానికి వెల్ల‌క‌పోవ‌డ‌మే మంచిద‌నే అభిప్రాయంతో జూ.ఎన్టీయర్ ఉన్న‌రన్న‌ట్లు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -