Friday, April 26, 2024
- Advertisement -

తెలంగాణా ఫ‌లితాల‌తో పుల్ జోష్‌లో ఉన్న వైసీపీ….

- Advertisement -

తెలంగాణా ప్ర‌జ‌లు టీఆర్ఎస్‌కే మ‌రో సారి ప‌ట్టం క‌ట్టారు. మ‌హాకూట‌మి చెంప చెల్లుమ‌నిపించారు. కాంగ్రెస్, టీజేఎస్,సీపీఐలతో పొత్తుపెట్టుకుని తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు చంద్ర‌బాబు. కూట‌మి పేరుతో బాబు చేసిన న‌క్క‌జిత్తులు ఫ‌లించ‌లేదు. కూట‌మిని అడ్డంగా బొందు పెట్టారు తెలంగాణా ప్ర‌జ‌లు.

ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏపీలో బాబు క‌ష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఇలాంటి ఫితాలే అక్క‌డ కూడా 2019లో పున‌రావృతం అవుతాయ‌నే భ‌యంలో బాబు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని ఆంధ్రా సెటిల‌ర్ల ఓట్ల‌పై భారీగా ఆశ‌లు పెట్టుకున్న బబుకి షాక్ ఇచ్చారు. అంతే కాకుండా ఖమ్మం, నల్గొండ జిల్లాలోని భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు .

సైబరాబాద్ ను తానే నిర్మించానని, హైదరాబాద్ ను ప్రపంచ చిత్రపటంలో పెట్టింది తానేని చెప్పుకొచ్చారు. తెలంగాణ నిర్మాణంలో అసలు కేసీఆర్ పాత్రే లేదంటూ కొట్టిపారేశారు. చంద్రబాబు నాయుడు చర్యలతో చిర్రెత్తుకొచ్చిన చిన్న గులాబీ బాస్ తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెట్టారు కాబట్టి తాము ఏపీ రాజకీయాల్లో వేలుపెడతామంటూ ప్రకటించారు కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గులాబీ పార్టీ వేలు పెట్టక తప్పదని ఆ పరిస్థితిని చంద్రబాబే స్వయంగా సృష్టించారని కెటిఆర్ హాట్ కామెంట్స్ చేశారు.

టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆంధ్రా రాజకీయాల్లో తాము వేలుపెడతామంటూ కేసీఆర్, కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీలో గుబులు రేపుతోంది.సీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడును ఎలా ఢీకొంటారు..ఏవిధంగా ఏపీ రాజకీయాల్లో అడుగుపెడతారంటూ దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది.

ఇప్పటికే చంద్రబాబు జుట్టు తమ చేతుల్లోనే ఉందంటూ టీఆర్ఎస్ చెప్తోంది. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి కీలక ఆధారాలు ఉన్నాయంటూ ప్రకటిస్తోంది. ఈ కేసును స్పీడ్ పెంచ‌నున్నార‌నే వార్త‌లు బాబును క‌ల‌వ‌ర పెడుతున్నాయి.

వైసిపి, జనసేన పార్టీలలో ఏదో ఒక పార్టీకి మద్దతు ప్రకటించడమా లేక తెలంగాణ రాష్ట్రం తరహాలో ప్రజాకూటమిని ఏర్పాటు చెయ్యడమా అన్న కోణంలో ఆలోచించే అవకాశం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాకూటమికి టీఆర్ఎస్ కీలక భూమిక పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మెుత్తానికి చంద్రబాబు నాయుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వేలు పెట్టినందుకు గానూ చుక్కలు చూపించేందుకు గులాబీ దళం రెడీ అవుతుంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆగర్భ శత్రువులను ఏకం చేసి ఏపీలో కూడా సైకిల్‌ను బొంద పెట్టేంద‌కు కేసీఆర్ రెడీ గా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -