Saturday, April 27, 2024
- Advertisement -

ఈ మంత్రి తన పదవిని కోల్పోవడం గ్యారెంటీనా..?

- Advertisement -

ఈ ఎన్నికల్లో  ప్రజల తీర్పు తో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ పీఠమెక్కినా సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ కి ఉన్న పాపులారిటీ తో ఆయనపై నమ్మకం ఉంచారు.. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికి తెలిసందే.. రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ప్రధానాంశంగా ఇప్పుడు తయారైంది. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రం గా తప్పుబడుతున్న జగన్ మాత్రం అనుకున్నది సాధించి తీరారు..  ఇక గత పదిహేను రోజులు గా వైసీపీ వర్గాల్లో ఓ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది..

వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి పదవి ఇప్పుడు ప్దామాదంలో పడిందన్న వార్తలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.. దేవ‌దాయ శాఖ మంత్రి  గా పనిచేస్తున్న వెల్లంపల్లి ప‌రిణామాల‌ను అరిక‌ట్ట‌డంలోను, ప్ర‌తిప‌క్షాల‌కు స‌రైన కౌంట‌ర్ ఇవ్వ‌డంలోను పూర్తిగా విఫలమయ్యారని అందుకే వైసీపీ అధిష్టానం ఆయనపై కొంత అసహనంగా ఉన్నారని చెప్తున్నారు.. జానికి అంత‌ర్వేది ర‌థం ద‌గ్థం ఘ‌ట‌న‌లో 10 మంది అధికారుల‌ను స‌స్పెండ్ చేశామ‌ని మంత్రి స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అదేవిధంగా ఇత‌ర ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి కూడా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తంగా 50 మంది అధికారులను ఇంటి ముఖం ప‌ట్టించామ‌న్నారు.

అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై అవునన్నట్లు మౌనంగా ఉండడం, వారికి ధీటుగా బదులు ఇవ్వలేకపోవడం తో ఆయనకు ఇక్కట్లు తప్పవని అనిపిస్తుంది. ఇక విజయవాడ సింహాల చోరీ విషయంలో కూడా మంత్రి వెలంప‌ల్లి చేసిన వ్యాఖ్య‌లు నిర్మాణాత్మ‌కంగా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మూడు సింహాలు కాదు.. రెండు సింహాలే.. ఒక వేళ లాక‌ర్‌లో పెట్టి ఉంటారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనే జ‌రిగి ఉంటుంది.. వంటి అర్ధం లేని వ్యాఖ్య‌లు.. ఆయ‌న‌ను మ‌రోసారి బోనులో నిల‌బెట్టేలా చేశాయి.దాంతో వెల్లంపల్లి దీన్ని ఇంత లైట్ తీసుకోవడంతో ప్రభుత్వానికి అయన సమాధానం చెప్పాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి..  ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు ప‌ద‌వీ గండం పొంచి ఉంద‌ని.. జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఉన్నార‌ని.. వైసీపీ నాయ‌కులు త‌మ‌లో తామే చ‌ర్చించుకుంటున్నారు. మరి దీన్ని వెల్లంపల్లి ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -