ఆ రాముడు మనకెందుకు? ఒక్క పైసా ఇవ్వొద్దు: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు

- Advertisement -

అయోధ్య రామ మందిరం నిర్మాణంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో నిర్మించే రామాలయానికి ఎవరూ చందాలు ఇవ్వవద్దని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు అయోధ్యలో రామాలయం నిర్మిస్తామంటూ బిచ్చమెత్తుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగిత్యాలలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మన గ్రామాల్లో రాముడు లేడా ఉత్తర ప్రదేశ్‌లో రామాలయానికి మనం చందాలెందుకు ఇవ్వాలి. బొట్టుపెట్టుకుంటేనే రామభక్తులా.. మేము కూడా శ్రీరాముడి భక్తులమే’అని ఎమ్మెల్యే విద్యాసాగర్ అన్నారు. ఎమ్మెల్యే

బీజేపీ, టీఆఆర్‌ఎస్‌ మధ్య తోపులాట
విద్యాసాగర్‌రావు వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణులు ఆయన దిష్టిబొమ్మ దహనం చేయగా.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆక్కడి చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. జగిత్యాల ఎస్పీ సింధు శర్మ పోలీసు అధికారులతో కలిసి మెట్‌పల్లికి వచ్చి ఇరువర్గాలను శాంతిపజేసేందుకు ప్రయత్నించారు. వారు ససేమీరా అనడంతో లాఠీచార్జ్‌ చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

- Advertisement -

కోరుట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సంజయ్‌ మండిపాటు
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. ‘సీఎం తిరుపతి వెళ్లి ఎందుకు డబ్బులిచ్చారు? రాముడు ఎక్కడ జన్మించారో, ఆలయ నిర్మాణం ఎందుకు జరుగుతుందో ఆ ఎమ్మెల్యే తెలుసుకోవాలి. ఇది బీజేపీ కార్యక్రమం కాదు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు మతవిద్వేషాలు రగిల్చేవే. ఆయనపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?’అని ప్రశ్నించారు.

‘దేవినేని ఉమ ఓ లోఫర్‌..వదినను చంపి రాజకీయాల్లోకి వచ్చాడు’

టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

బుల్లితెరపై కూడా కన్నేసిన స్టార్ హీరోయిన్లు..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News