జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రియాశీకల రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం సినిమాల కన్నా రాజకీయాలపైనే జనసేనానాని గట్టిగా ఫోకస్ చేసినట్లు స్పష్టంగా అర్థమౌతోంది. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటలని పవన్ వేస్తున్న ప్రణాళికలు కొంత మేర విజయం అధిస్తున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా జనసేనాని చేపట్టిన ” కౌలు రైతు భరోసా యాత్ర ” కు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. అంతే కాకుండా ” జనవాణి ” కార్యక్రమంపై కూడా ప్రజలు సానుకూలంగా స్పందింస్తున్నారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో జనసేనాని.. మరింత దూకుడు పెంచారు. ఆ మద్య ” గుడ్ మార్నింగ్ సిఎం సార్ ” అంటూ జగన్ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితిపై సోషల్ మీడియాలో గట్టిగానే హల్చల్ చేశారు. .
కాగా వచ్చే ఎన్నికలే టార్గెట్ గా పవన్ చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ జనసేనకు మంచి మైలేజ్ తెచ్చిపెట్టాయి. దీంతో ప్రజల్లో జనసేన గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతున్నట్లు విశ్లేషకులు సైతం ఒప్పుకుంటున్నారు. ఇక ఇదే జోష్ ను వచ్చే ఎన్నికల వరకు కొనసాగించేలా పవన్ ప్రణాళికలు సిద్దం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి.. పవన్ ఈ దసరా నుంచి బస్సు యాత్ర చేపట్టబోతున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ బస్సు యాత్ర వల్ల జనసేనకు మరింత మైలేజ్ రానుందని, జనసైనికులు భావించారు. అయితే ఈ బస్సు యాత్రను వాయిదా వేస్తున్నట్లు తాజాగా పవన్ ప్రకటించారు. ” ఈ సారి ఎన్నికల్లో సర్వేల ప్రకారం వైసీపీ 45 నుంచి 67 స్థానాలకే పరిమితం కానుందని.. ఇదే సమయంలో జనసేనకు ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతున్నట్లు సర్వేలు వెల్లడించాయని.. ” పవన్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అందరితోనూ చర్చించి, పార్టీ సన్నద్దత కోసం వచ్చిన సూచనలను దృష్టిలో పెట్టుకొని.. బస్సు యాత్రను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు పవన్ తెలిపారు.
అయితే ప్రస్తుతం ప్రజల్లో జనసేన గ్రాఫ్ పెరుగుతుంటే.. బస్సు యాత్రను వాయిదా వెయ్యాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమౌతున్నాయి. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అనే దానిపై విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం.. బస్సు యాత్రకు బదులుగా పవన్ పాదయాత్ర చేపట్టే అవకాశం కూడా లేదపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే రాజకీయ నేతలు చేపట్టే పాదయాత్రలు ప్రజల్లో అత్యంత ప్రభావం చూపుతాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ వంటి వారు పాదయాత్రల తరువాతే ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన సంగతి తెలిసిందే. దాంతో అదే దారిలో పవన్ కూడా వెళ్ళే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జనసేనకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో బస్సు యాత్ర కన్నా పాదయాత్ర చేపడితే ప్రజల దృష్టిని మరింత ఆకర్షించవచ్చని.. అందుకే పవన్ బస్సు యాత్రను వాయిదా వేసి ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి బస్సు యాత్ర.. లేక పాదయాత్ర అనే దానిపై జనసేనాని ఏం ఆలోచిస్తున్నారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.
Also Read : సినిమాల్లో విజయ్.. రాజకీయాల్లో జగన్ !
