Thursday, April 25, 2024
- Advertisement -

రాష్ట్రంలో పరిపాలన అంటే ఏంటో చూపించగలిగాం: సీఎం జగన్

- Advertisement -

అత్యుత్తమ సేవలందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలను.. ముఖ్యమంత్రి జగన్.. గ్రామ, వార్లు వాలంటీర్లకు ప్రదానం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో పరిపాలన అంటే ఏంటో చూపించగలిగామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. కులాలు, మతాలు చూడకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. విమర్శలకు బెదరకుండా పనిచేయాలని.. వాలంటీర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

దాదాపు 20 నెలల క్రితం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. రాష్ట్రంలో పరిపాలన అంటే ఏంటో చూపించగలిగాం. పథకాలకు రాష్ట్రంలో గ్రామగ్రామాన సంధానకర్తలుగా ఉన్నారు. కులాలు, మతాలు చూడకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నారు.

ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. వాలంటీర్లలో 53 శాతం మంది మహిళలు ఉన్నారు. ఏటా వాలంటీర్లకు సత్కారం కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అవార్డు ప్రదాన కార్యక్రమం కొనసాగుతుంది అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

భారత తదుపరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా సుశీల్ చంద్ర

విజయవాడ గొల్లపూడిలో దారుణం..

దేశంలో కరోనా ఉధృతి.. ఒకే రోజు 1.68 ల‌క్ష‌ల మందికి పాజిటివ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -