Friday, April 19, 2024
- Advertisement -

దేశంలో కరోనా ఉధృతి.. ఒకే రోజు 1.68 ల‌క్ష‌ల మందికి పాజిటివ్

- Advertisement -

దేశంలో క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) పంజా విసురుతోంది. ఆకాశ‌మే హ‌ద్దు అనే రీతిలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌న ప్ర‌భావాన్ని పెంచుకుంటోంది. దీంతో రికార్డు స్థాయిలో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మ‌ర‌ణాలు సైతం అధిక‌మ‌వుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 1,68,912 మందికి కరోనా సోకింది.

ఇప్ప‌టివ‌ర‌కు ఒకే రోజులో దేశంలో న‌మోదైన అత్య‌ధిక క‌రోనా కేసులు ఇవే. అలాగే, మ‌ర‌ణాలు సైతం పెరిగాయి. తాజాగా 904 మంది కోవిడ్‌-19తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,70,179కి పెరిగింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,35,27,717 చేరింది. కొత్త‌గా 75,086 మంది కోలుకోవ‌డంతో ఆ సంఖ్య 1,21,56,529కి పెరిగింది.

కాగా, ప్ర‌స్తుతం దేశంలో 12,01,009 క్రియాశీల కేసులు ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో అధికార యంత్రాంగం వ్యాక్సినేష‌న్‌, క‌రోనా ప‌రీక్ష‌లు ముమ్మ‌రంగా చేప‌డుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 25,78,06,986 కరోనా పరీక్షలు నిర్వ‌హించిన‌ట్టు ఐసీఎంఆర్ వెల్ల‌డించింది. ఆదివారం ఒక్క‌రోజే 11,80,136 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. కాగా, దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 10,45,28,565 మందికి క‌రోనా టీకా అందించారు.

మాస్కులు ధరించని వారిపై పోలీసులు కొరడా !

అల్లు అర్జున్ పుష్ఫ.. ఆ టైంకు వ‌చ్చేనా?

ఆచార్య, విరాట పర్వం సినిమాలకు షాక్‌ !

కరోనా టీకా.. పంజాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్

దేశంలో కొత్తగా 1.52 లక్షల కరోనా కేసులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -