Friday, April 19, 2024
- Advertisement -

తెలంగాణా లో ప్రత్యామ్నాయ పార్టీ ఏదంటే..?

- Advertisement -

ఇన్నాళ్లు తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీ కి ఎదురు లేదన్నది వాస్తవం.. ఇప్పుడు కూడా లేదు కానీ ప్రతిపక్షాలు తామంటే తాము టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం అని చెప్తూ గులాబీ నేతలను నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది.. ఎవరు తెలంగాణ లో ప్రతామ్నాయ పార్టీ అనేది ప్రజలు చూసుకుంటారు చేయాల్సిన పని చేయమని గులాబీ నేతలు అంటుంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీ అధికారమే లక్ష్యం గా సాగిపోతూ ప్రజలను చిరాకు పెట్టిస్తున్నారు.. ప్రజల్లో ఎలాంటి బలం లేని కాంగ్రెస్ పార్టీ , ఒక్క నాయకుడు కూడా సరిగ్గా లేని కాంగ్రెస్ పార్టీ అయితే నిజంగా అధికారంలోకి వస్తున్నట్లు మాట్లాడడం టిఆర్ఎస్ నేతలకు నవ్వు తెప్పిస్తుంది..

గట్టిగా గెలిస్తే ముఖ్యమంత్రి పదవికోసం నేనంటే నేను అని కొట్టుకునే ఈ పార్టీ ప్రజలకు ఏమాత్రం మేలు చేస్తుందో అర్థం కావట్లేదు.. ఇక బీజేపీ సంగతి సరేసరి.. నాలుగు ఎంపీ సీట్లు గెలిస్తే ముఖ్యమంత్రి పదవి వచ్చేసినట్లే అని ఫీల్ అయి తెగ హడావుడి చేస్తుంది.. ఎదో కేంద్రంలో అధికారంలో ఉందని బీజేపీ పార్టీ ని ప్రజలు చేరదీయడం తప్పా లేదంటే ఎప్పటిలాగే నోటా కి సరిసమానం చేసేవారే..

ఇక ఇప్పుడు ప్రజల దగ్గరినుంచి వచ్చే మాట ఏంటంటే గ్రేటర్ ఎన్నికల్లో ఎవరికీ వారు తమ సత్తా చాటుకోండి.. అప్పుడు తెలంగాణ లో టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయ పార్టీ ను తాము డిసైడ్ చేస్తామని అంటున్నారు.. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎన్నికల వాతావరణం ప్రారంభమయింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణ ప్రారంభించడంతో.. తెలంగాణ ఎస్‌ఈసీ కూడా జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది. రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. గ్రేటర్ ఎన్నికల బాధ్యత తీసుకున్న కేటీఆర్ నవంబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా ఎన్నికలుండొచ్చని, సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో 99 సీట్లు సాధించి తొలి సారిగా బల్దియా పీఠం పై గులాబీ జెండా ఎగరేశారు. ఈ సారి పక్కా సెంచరీ కొడతామని చెబుతోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -