Wednesday, April 24, 2024
- Advertisement -

“జగన్ కోచింగ్” అంటే అదే మరి !

- Advertisement -

రాజకీయాల్లో ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల మద్య వాదోపవాదాలు, విమర్శ ప్రతి విమర్శలు, సర్వ సాధారణం. అయితే రాజకీయ నాయకులు ఒక హద్దు వరకు విమర్శలు చేసుకోవడం రాజకీయ విలువలను పెంచుతాయి. కానీ హద్దులు దాటి విమర్శలకు బదులుగా బూతులు తిట్టుకోవడం ప్రధాన ఎజెండాగా ప్రవర్తిస్తున్నారు నేటి రాజకీయ నేతలు. ముఖ్యంగా ఏపీలో ఈ విధంగా బూతులు తిట్టుకోవడం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. అసెంబ్లీ లోనూ, ప్రెస్ మీట్ లలోనూ రాష్ట్ర ప్రజలకు అసహ్యం వేసే విధంగా పచ్చి బూతులు తిట్టడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నారు ఏపీలోని రాజకీయ నేతలు.

మరి అలా పచ్చి భూతులు తిడుతూ ఉంటే వారిని కంట్రోల్ చేయాల్సిన భాద్యత.. పార్టీ అధ్యక్షుడికి ఉండదా ? అంటే కచ్చితంగా ఉంటుంది. కానీ ఆ పార్టీ అధ్యక్షుడే వారికి అన్నీ విధాలుగా పర్మిషన్ ఇస్తే.. ఇంకేముంది ?.. రాజకియ విలువలను కూని చేయడమే అవుతుంది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైఖరి చూస్తుంటే ఇలాగే ఉంది. ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఎందుకు తిప్పికొట్టడం లేదని మంత్రులకు సి‌ఎం జగన్ క్లాస్ పీకారు. కొంత మంత్రి మంత్రులు విమర్శలు వస్తున్నప్పటికి ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని, తీరు మార్చుకోకపోతే క్యాబినెట్ లో మార్పులు తప్పవని హెచ్చరించారు.

ఆరోపణలు వస్తున్న చాలమంది మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అయితే గత క్యాబినెట్ లో కొడాలి నాని, పెర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు విమర్శలలో మిలితంగా బూతులు మాట్లాడే వారు. అయితే వారు మాట్లాడే భాష విధానాన్ని జగన్ ఏరోజు కూడా తప్పుబట్టిన సందర్భాలు లేవు. దాంతో ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ మంత్రులలో ఆ స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేసే వారు లేకపోవడంతో వల్లే జగన్ తన మంత్రులకు క్లాస్ పికారని రాజకియ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఏది ఏమైనప్పటికి ఏపీలో ప్రధాన పార్టీల అధ్యక్షుల అనుమతి మేరకు నేతలు మాట్లాడే భాష విధానం ప్రజలకు అసహ్యం తెప్పించే విధంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read

జగన్ దెబ్బతో లోకేష్ కు ఏది దిక్కు ?

పోరాడతారా.. ఇంటికే పరిమితం అవుతారా ?

టీడీపీ ఎన్డీయేలో చేరితే ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -