Friday, April 26, 2024
- Advertisement -

మూడు రాజధానులు పక్కా.. తదుపరి వ్యూహం ఏంటి ?

- Advertisement -

వైఎస్ జగన్ అధికరంలోకి వచ్చిన తరువాత ఎన్నో ఊహించని నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారారు. అందులో మూడు రాజధానుల ప్రస్తావన కూడా ఒకటి. అధికరంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ మూడు రాజధానుల ప్రస్తావనను తెరపైకి తెచ్చి ఏపీలో పోలిటికల్ హిట్ పెంచారు సి‌ఎం జగన్. ఈ మూడు రాజధానుల విషయంలో ప్రతిపక్షం నుంచి తీవ్రమైన విమర్శలు ఎదురౌతున్నప్పటికి, జగన్ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ అమరవతిని ఏపీ రాజధానిగా ప్రకటించారు. దీంతో అక్కడి రైతులు రాజధాని కోసం భూములను త్యాగం చేశారు..

తీరా వైఎస్ జగన్ అధికరంలోకి వచ్చిన తరువాత రాజధానికి అమరవతికి మాత్రమే పరిమితం చేయకుండా.. విశాఖా, కర్నూల్ వంటి నగరాలకు కూడా విస్తరించేందుకు పూనుకోవడంతో అమరావతి రైతులు హైకోర్టు ను ఆశ్రయించారు. దీంతో మూడు రాజధానుల ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించింది. ఇక అప్పటినుంచి మూడు రాజధానుల ప్రస్తావన కాస్త మరుగున పడినప్పటికి, వైసీపీ నేతలు మాత్రం అప్పుడప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మరో సారి మూడు రాజధానుల విషయంలో స్పష్టతనిచ్చారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో మూడు రాజధానులు జరిగి తీరుతాయని మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో మరోసారి స్పస్టం చేశారు. విశాఖాను ఎట్టి పరిస్థితీల్లో పరిపాలన రాజధానిగా చేయడం తథ్యమని, అమరావతితో పాటు విశాఖా, కర్నూల్ కూడా తమకు ముఖ్యమని కొడాలి నాని చెప్పుకొచ్చారు.

అయితే మూడు రాజధానుల ప్రస్తావన తెరపైకి వచ్చి ఇప్పటికే మూడేళ్లు పూర్తి అయింది. చట్ట సభలో బిల్లు ప్రవేశ పెట్టినప్పటికి బిల్లు ముందుకు సాగలేదు. దానికి తోడు మూడు రాజధానులపై హైకోర్టు కూడా స్పష్టతనివ్వలేదు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ తదుపరి వ్యూహం ఏంటి అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే త్రీ క్యాపిటల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టతనిచ్చింది. హైకోర్టు, రాష్ట్రప్రభుత్వం కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికి హైకోర్టు మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇక మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటు పూర్తవుతుందా ? లేదా ఇదొక నిర్ణయంగానే మిగిలిపోతుందా అనేది చూడాలి.

More Like This

రాహుల్ vs మోడీ.. బట్టల్లో ఎవరు తోపు ?

జాతీయ పార్టీకి రంగం సిద్దం.. ప్రకటనే తరువాయి ?

“జగన్ కోచింగ్” అంటే అదే మరి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -