Friday, April 26, 2024
- Advertisement -

దుబ్బాక లో ఎలక్షన్ పై హరీష్ రావు కు ఎందుకంత టెన్షన్..?

- Advertisement -

తెలంగాణ వచ్చిన తర్వాత తిరుగులేని శక్తిగా ఎదిగిన టి.ఆర్.ఎస్ పార్టీ కి గతంలో ఎప్పుడు లేనంతగా వ్యక్తిరేకత గత కొద్దీ కాలంగా ఉందని ప్రతిపక్షాలు తెగ ప్రచారం చేసుకుంటున్నాయి.. అయితే అధికార పార్టీ మాత్రం దీన్ని కొట్టేస్తుంది.. తెలంగాణాలో గులాబీ పార్టీ ప్రజలకు ఎప్పుడు విధేయతగా ఉంటుంది అందుకే ప్రజలు పార్టీ ను గెలిపిస్తూ వస్తున్నారు అని చెప్తున్నారు.. దుబ్బాక లో గులాబీ దండు విజయం సాధించడం ఖాయమనై చెప్తున్నారు.. వాస్తవానికి ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ కి గతంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది.. ఎప్పుడు ఓడిపోకపోగా భారీ మెజారిటీ తో విజయం సాధించింది. దుబ్బాక లో కూడా అదే చరిత్ర రిపీట్ అవుతుందని గులాబీ నేతలు అభిప్రాపపడుతున్నారు..

నిన్న కేంద్ర ఎన్నికల సంఘం దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. నవంబర్ మూడో తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచే బాధ్యత ను కేసీఆర్ హరీష్ రావు కి అప్పగించగా నోటిడికేషన్ రాకముందునుంచే హరీష్ రావు ఈ నియోజకవర్గంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు.. తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలా అయన చెమటోడ్చుతున్నారు.. అయితే హరీష్ రావు ఇక్కడ ఇంతలా కష్టపడిపోవడానికి కారణం లేకపోలేదు.. గత ఆరేళ్లుగా పార్టీ మంచి పరిపాలన కొనసాగిస్తూ ఉండగా, ఇటీవలే కాలంలో వచ్చిన విమర్శలు ఎప్పుడు రాలేదు.. ఇలాంటి టైం లో గెలిచి పార్టీ సత్తా ఛత్ల్సిన అవసరం ఎంతైనా ఉంది..

ఒకవేళ ఇక్కడ పార్టీ ఓడిపోతే పార్టీ పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకత ఎక్కువయి అది వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని హరీష్ రావు భావిస్తున్నారట అందుకే ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలని కేసీఆర్ కఠినమైన ఆర్డర్స్ పాస్ చేశారట. దుబ్బాక ఎమ్మెల్యే మరణం వల్ల ఈ ఎన్నిక వస్తుంది కాబట్టి సింపతీ ఓట్లు ఎలాగూ ఎటు పోవు, ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అన్ని చోట్లా విజయం సాధించింది. అన్ని శుభ పరిణామాలే ఉన్నా హరీష్ రావు ప్రజలను భయపెట్టే విధంగా రాజకీయాలు చేస్తున్నారు..టీఆర్ఎస్ కాకుండా వేరే వాళ్లకి ఓటేస్తే.. కరెంట్ కనెక్షన్లకు మీటర్లు వస్తాయని హరీష్ రావు భయపెడుతున్నారు. అయితే ఈజీ గా గెలిచేదాన్ని హరీష్ ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నారు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -