Sunday, May 12, 2024
- Advertisement -

ఎవ‌రి గోల వారి దె…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపుపై టిడిపి, వైసిపిలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ లోలోపల వారు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అధికార పార్టీ గెలుపుకు కొంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి… కానీ నంద్యాలలో అందుకు ప‌రిస్థితి భిన్నంగా ఉంది.

టిడిపి, వైసిపి పోటాపోటీగా ఉన్నాయి. వైయస్ జగన్ కాల్చివేత వ్యాఖ్యలు తటస్థ ఓటర్లలో కొంత ఆలోచన చేసేలా చేశాయని అంటున్నారు.మ‌రోవైపు రూ.1200 కోట్ల‌తోరుగుతోన్న అభివృద్ధిని కొనసాగించాలంటే టిడిపి అభ్యర్థిని గెలిపించాలని మెజారిటీ నేతలు అభిప్రాయ ప‌డుతున్నారు.మ‌రో వైపు ప ఎన్నికలు వచ్చినందువల్లే అభివృద్ధి జరుగుతోందని, కాబట్టి టిడిపిని నమ్మే పరిస్థితి లేదని మరికొందరు భావిస్తున్నారని అంటున్నారు.

నంద్యాల ప్ర‌చారానికి 25 మంది ఎమ్మెల్యేలు వెళ్లినప్పటికీ వారంతా పైపైనే తిరుగుతున్నారనే ఆందోళన టిడిపిలో నెలకొంది. వీరు చాలామంది సాయంత్రానికి వచ్చి ఏదో అటెండెన్స్ వేసుకొని వెళ్తున్నారని సమాచారం.కొందరు పార్టీ నేతలతో పాటు భూమా నాగిరెడ్డికి సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. భూమా కుటుంబ సభ్యులు ఆయనను అంతగా ఆదరించడం లేదని కూడా ప్రచారం సాగుతోంది.

భూమా బ్రహ్మానంద రెడ్డి రాజకీయాలకు కొత్త కాబట్టి ఆయన వెంట ప్రచారానికి వెళ్లాల్సిందేనని అఖిలప్రియకు అధిష్టానం చెప్పిందని తెలుస్తోంది. ఇంటింటికి తిరగాలని, సూచించింది.ఈ నెల తొమ్మిది నుంచి 21 వరకు వైసిపి అధినేత జగన్‌ నంద్యాలలో మకాం వేయనున్నారు. అది కూడా మనకు మంచిదేనని టిడిపి నేతలు విశ్లేషిస్తున్నారట. దీనివల్ల తమ పార్టీ క్యాడర్‌లో కసి పెరుగుతుందని, నాయకులు మరింత కష్టపడతారని చెబుతున్నారు.పులిని చూసి న‌క్క‌వాత పెట్టుకున్న‌ట్టు ఉంది టీడీపీ ప‌రిస్థితి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -