Friday, May 10, 2024
- Advertisement -

జగన్‌పై హత్యాయత్నం….. ప్రజలే బాబుకు సమాధానం చెప్పారా?

- Advertisement -

జగన్‌పై హత్యాయత్నం ఘటన తెలుగు ప్రజలందరినీ షాక్‌కి గురిచేసింది. దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. అయితే దాడి తర్వాత చంద్రబాబు, డిజిపిల స్పందన ఇంకా అమానవీయంగా అనిపించింది. అదే విషయాన్ని తాజాగా ప్రజలే తేల్చిచెప్పారు. కోడికత్తిదాడి అంటూ టిడిపి భజన మీడియాలో వెటకారపు రాతలు, చంద్రబాబు కూడా అంతే వ్యంగ్యంగా మాట్లాడడంలాంటి పరిణామాలను ప్రజలు ఎంతలా అసహ్యించుకుంటున్నారో తాజాగా జగన్ ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా అందరికీ తెలిసొచ్చింది.

ప్రజా సంకల్పయాత్ర మొదలు పెట్టడానికి మూడు గంటలు ముందే స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారు. ఆ తర్వాత ముసలి వాళ్ళతో సహా చాలా మంది ప్రజలు స్వయంగా దెబ్బతగిలిన చెయ్యి పట్టుకుని నడిపించారు. జగన్‌కి తోడుగా నిలిచారు. వేలాది మంది ప్రజలు జగన్‌ని ఆశీర్వదించడానికి వచ్చారు. అన్నింటికీ మించి ప్రజలందరూ కూడా చంద్రబాబువి హత్యా రాజకీయాలు అని ముక్తకంఠంతో నినదించడం విశ్లేేషకులను కూడా ఆశ్ఛర్యపరిచింది. జగనే కనుక తనపైన తానే దాడి చేయించుకుని ఉంటే అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు తన ఆధ్వర్యంలో పనిచేస్తున్న విచారణ సంస్థల ద్వారా ఆ విషయాన్ని ఎందుకు నిరూపించలేకపోతున్నాడని ప్రజలు నిలదీశారు. 2014లో కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకుంటానన్న చంద్రబాబు ఇప్పటి వరకూ జగన్ దగ్గర ఒక్క రూపాయి అక్రమాస్తి ఉన్నట్టు నిరూపించలేకపోయాడు. ఒక్క రూపాయి కూడా స్వాధీనం చేసుకోలేకపోయాడు.

అలాగే తుని రైలు ఘటన నుంచి అన్ని విషయాల్లోనూ కడప రౌడీలు, వైకాపా మనుషులు చేశారు అన్నట్టు మాట్లాడే చంద్రబాబు ఒక్క కేసు కూడా ఎందుకు నిరూపించలేకపోయాడని ప్రజలు నిలదీస్తున్నారు. జగనే కనుక దాడి చేయించుకుని ఉంటే ఈ పాటికే చంద్రబాబు కోసం పనిచేస్తున్న విచారణ సంస్థలు, పోలీసులు సాక్ష్యాధారాలతో సహా నిరూపించేవాళ్ళని, జగన్‌కి శిక్షపడేలా చేసేవాళ్ళని……….జగన్‌పై ప్రత్యర్థులు చేసిన హత్యాప్రయత్నం కాబట్టే అధికారంలో ఉన్నవాళ్ళు నిందితులకు వత్తాసు పలుకుతూ……విచారణను నీరుగారుస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఏ స్థాయిలో మీడియా మేనేజ్‌మెంట్‌తో మాయ చేయాలని చూసినప్పటికీ గ్రౌండ్ లెవెల్‌లో ప్రజలకు మాత్రం ఈ హత్యాయత్నాల వెనుక ఉన్న పచ్చ రాజకీయాలు పూర్తిగా అర్థమయ్యాయని జగన్ ప్రజాసంకల్పయాత్ర పునఃప్రారంభ రోజు ప్రజల స్పందనను చూసిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -