Friday, April 26, 2024
- Advertisement -

ఎపిలో పొలిటికల్ సెన్సేషన్…… వైకాపాలోకి బాబును షేక్ చేసే చేరికలు

- Advertisement -

చంద్రబాబు పోల్ మేనేజ్మెంట్……….ప్రపంచంలోనే చంద్రబాబును మించిన పాలకుడు లేడు అన్న ఎల్లో మీడియా ప్రచారాన్ని విజయవంతంగా తిప్పికొట్టి 2004 ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రజల్లో అభిమానం లేకపోయినప్పటికీ తాను గెలవడానికి అధికార అక్రమాలతో సహా అన్ని వ్యవస్థలనూ చంద్రబాబు వాడినప్పటికీ వైఎస్‌కి ఉన్న ప్రజాదరణ ముందు తలొంచక తప్పలేదు. అప్పట్లో పచ్చ మీడియా సర్వేలతో సహా చాలా సర్వేల్లో మళ్ళీ బాబుదే అధికారం అని ప్రచారం చేయించినప్పటికీ ప్రజలు మాత్రం వైఎస్‌కి పట్టంగట్టారు. ఆనాడు వైఎస్‌ పొలిటికల్ వ్యూహరచన రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరిచింది.

ఇప్పుడు వైఎస్ జగన్ కూడా 2019 ఎన్నికలకు అదే స్ట్రాటజీలతో వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. బూత్ స్థాయిలో వైకాపాను స్ట్రాంగ్‌గా నిలబెట్టడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాడు. 2004లో బాబును అభిమానించే ఒక వర్గం ఓట్లు, ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు వైఎస్‌కి పడడానికి ఎన్టీఆర్ కుమార్తే దగ్గుబాటి పురంథేశ్వరితో పాటు ఆమె భర్త, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేరిక చాలా ఉపయోగపడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఈ ఇద్దరినీ చాలా అభిమానించాడు. ఆ అభిమానాన్ని గుర్తుంచుకునే ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులూ వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నారు. పర్చూరు నియోజకవర్గం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నాడు. ఎన్టీఆర్‌కి మద్దతుగా చాలా సందర్భాల్లో నిలబడ్డాడు దగ్గుబాటి. తెలుగు దేశం పార్టీ స్థాపించక ముందు నుంచీ, అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చాక కూడా అండగా నిలిచాడు.

అయితే బాలకృష్ణతో సహా ఎన్టీఆర్ కొడుకులే చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్‌కి సహకరించిన నేపథ్యంలో దగ్గుబాటి కూడా చంద్రబాబు వెంట నడిచాడు. అయితే ఆ వెంటనే తన తప్పు తెలుసుకుని పశ్ఛాత్తాపం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత నుంచీ చంద్రబాబుపై పోరాటం చేస్తూనే ఉన్నాడు. అందుకే దగ్గుబాటిపై ఎన్టీఆర్ అభిమానులు కూడా అభిమానం చూపిస్తారు. పర్చూరు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న దగ్గుబాటి ఆ నియోజకవర్గంలో గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అన్నింటికీ మించి దగ్గుబాటి దంపతులు వైకాపాలో చేరితే అది జగన్‌కి బిగ్గెస్ట్ బూస్ట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు, చంద్రబాబు వాడుకుని వదిలేసే తత్వం, అధికార దాహం గురించి సర్వమూ తెలిసిన దగ్గుబాటి చేసే విమర్శలను కాచుకోవడం టిడిపికి అంత సులభం కాదని……..అలాంటి పరిణామాలు వైకాపాకు కలిసొస్తాయని విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తంగా చూస్తే 2004 ఎన్నికల్లో వైఎస్‌ని గెలిపించిన అంశాలన్నీ ఇప్పుడు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్‌కి కూడా కలిసొచ్చేలా ఉన్నాయని……ఈ పరిణామాలన్నీ కూడా చంద్రబాబుతో పాటు టిడిపి నాయకుల్లో ఆందోళన పెంచడం ఖాయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -