Friday, April 26, 2024
- Advertisement -

జనసేనాని కొత్త ప్రయత్నాలు.. ఫలించేనా ?

- Advertisement -

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకోసం సరికొత్తగా జనల్లోకి వెళుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ పాలనలోని లొసుగులను బయటపెడుతూ ప్రజలను తమవైపు తిప్పుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా ” గుడ్ మార్నింగ్ సి‌ఎం సార్ ” పేరుతో డిజిటల్ క్యాంపైన్ కు శ్రీకారం చుట్టింది జనసేన పార్టీ. ఈ డిజిటల్ క్యాంపైన్ లో భాగంగా జగన్ పాలనలో రోడ్ల దుస్థితి ఎంత దరిద్రంగా ఉందో ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు బాగోలేని రోడ్లు అలాగే మరమత్తులకు నోచుకోని రోడ్ల యొక్క ఫోటోలను తీసి ” గుడ్ మార్నింగ్ సి‌ఎం సార్ ” హ్యాస్ ట్యాగ్ తో ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని జనసేన నేతలు చెబుతున్నారు. రోడ్ల విషయంలో గాఢ నిద్రలో ఉన్న సి‌ఎం ను నిద్రలేపేందుకే ” గుడ్ మార్నింగ్ సి‌ఎం సార్ ” పేరుతో డిజిటల్ క్యాంపైన్ నిర్వహించబోతున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేవలం సోషల్ మీడియా పరంగానే కాకుండా ప్రత్యేక్షంగా కూడా జనసేన ప్రజల్లో యాక్టివ్ గానే ఉండే ప్రయత్నం చేస్తోంది.

ఇప్పటికే జనవాణి పేరుతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు జనసేనాని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే జనవాణి కార్యక్రమంపై అటు ప్రజల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ పెద్దగా ఆసక్తి కనబరచడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఇక రాబోయే దసరా పండుగ నుంచి పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండేందుకు పవన్ గట్టి ప్రణాళికలు వేశారు. దసరా పండుగ మొదలుకొని రాబోయే ఎన్నికల వరకు నిర్విరామంగా ప్రజల్లో ఉంటూ, జనసేన విధానాలను బలంగా ప్రకటిస్తూనే, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు పక్క ప్రణాళికతో పవన్ సిద్దమైనట్లుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ విధంగా సోషల్ మీడియా ఫారంగాను అలాగే ప్రత్యేక్షంగా ప్రజల్లో ఉండే విధంగా పవన్ చేస్తున్న ఈ కొత్త ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాలను ఇస్తాయో చూడాలి.

Also Read

మోడి పాలనలో దేశం వెనుకడుగు.. ఆధారాలతో ?

జగన్నాటకం.. అంతా నాఇష్టం !

గులాబీ బాసుకు.. గుబులు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -