Tuesday, April 23, 2024
- Advertisement -

మోడీని గద్దె దించేందుకు.. ఉమ్మడి పోరు ?

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ హవా బలంగా ఉంది. ముఖ్యంగా 2014 నుంచి మోడీ మేనియా తో బీజేపీ బలం ఒక్కసారిగా పెరిగిందనే చెప్పాలి. అంతకు ముందు అద్వానీ హయాంలో బీజేపీ ప్రభావం నామమాత్రంగానే ఉండేది.. అయితే నరేంద్ర మోడి బిజెపి తరుపున భాద్యతలు చేపట్టిన తరువాత 2014 లో ఎన్డీయే కూటమి కనీవినీ ఎరుగని విజయాన్ని నమోదు చేసింది. అంతకు ముందు దేశంలో అత్యంగా బలమైన జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ను బీజేపీ మట్టి కరిపించడంలో మోడీ కి దేశవ్యాప్తంగా ఏర్పడిన మేనియానే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఇక భారత ప్రధానిగా నరేంద్ర మోడి బాద్యతహ్లు చేపట్టిన తరువాత బిజెపి గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది..

ఇక 2019 ఎన్నికల్లో కూడా బిజెపి ఘనవిజయాన్ని నమోదు చేయడంతో.. బీజేపీని కేంద్రంలో ఎదుర్కొనే పార్టీలు దాదాపుగా లేనట్టే అనే వాదనలు గట్టిగానే వినిపించాయి. ఎందుకంటే అంతకుముందు యూపీఏ తరుపున జాతీయంగా బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వ లోపంతో బలాన్ని కోల్పోతూ వస్తోంది.. దాంతో బీజేపీ హవా మరింత పెరుగుతూ వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో ఎలాగైనా కేంద్రంలో బీజేపీ ని గద్దె దించాలని విపక్షాలన్నీ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్త్న్నట్లు కనిపిస్తోంది. అందుకోసం రాజకీయ పార్టీలు అన్నీ బీజేపీపై ఉమ్మడి పోరుకు సిద్దమయ్యాయా ? అంటే అవుననే విశ్లేషకులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను గద్దె దించేందుకు ఎన్డీయే కూటమి, విపక్షాలు, ఇతరత్రా పార్టీలు అన్నికూడా కలిసి పొరాడి కాంగ్రెస్ ను గద్దె దించడంలో సక్సస్ అయ్యాయి.

దాంతో అదే ప్రణాళికను 2024 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని కుల్చేందుకు విపక్షాలన్నీ కూడా ఏకం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ అద్యక్షతలో యూపీఏ ను మరింత బలపరిచేందుకు ఎప్పటికే సోనియా గాంధీ వ్యూహాలు రచిస్తున్నారు. ఇక మమతా బెనర్జీ కూడా ప్రాంతీయ పార్టీలన్నీ కలుపోకొని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి మోడీ ఎదుర్కొనే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇక తాజాగా ఈ జాతీయ పోరులోకి టి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ కూడా ఎంట్రీ ఇచ్చి 2024 ఎన్నికల్లో మోడి ప్రభుత్వానికి చెక్ పెట్టె వ్యూహాలను రచిస్తున్నారు. ఈ విధంగా అన్నీ వైపులా నుంచి 2024 ఎన్నికల్లో మోడీకి చెక్ పెట్టేందుకు ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీల వరకు ఉమ్మడి పోరు కు సిద్దమయ్యాయి. మరి ఈ ఉమ్మడి పోరులో పార్టీలన్నీ బీజేపీ ని ఎంతమేర ఎదుర్కొంటాయో చూడాలి.

More Like This

సోనియా గాంధీపై సానుభూతి వస్తుందా ?

విస్తరిస్తోన్న ఆప్.. సౌత్ లో పాగా వేసేనా ?

ఒట్టు తీసి గట్టు మీద పెట్టిన బాబు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -