- Advertisement -

ఎల్లో మీడియా, బాబుపై విరుచుకు ప‌డ్డ జ‌గ‌న్‌..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం ఉయ్యూరులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. హోదాను ఖూనీ చేసిన చంద్రబాబు నాయుడు.. ఇంకా నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

ప‌నిలో ప‌నిగా ఎల్లోమీడియానుకూడా విమ‌ర్శించారు. చంద్రబాబును ఇంటలిజెన్స్ బ్యూర్ చీఫ్ కలిస్తే ఎల్లో మీడియా ఎందుకు దాచి పెట్టిందని ఆయ‌న ప్ర‌శ్నించారు. గవర్నర్ ను తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి కలిస్తే ఎందుకు దాచి పెట్టిందని ప్రశ్నించారు. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపించడానికి చంద్రబాబు ఎల్లో మీడియాను మేనేజ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఈ నెల 30వ తేదీ ప్రత్యేక హోదాపై చంద్రబాబు తలపెట్టిన సభపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీని చంపిన వ్యక్తే దీక్ష చేస్తా అన్నట్లుగా చంద్రబాబు వైఖరి ఉందని ఆయన దుయ్యబట్టారు. హోదాను ఖూనీ చేసిన వ్యక్తే తిరుపతిలో సభ పెడుతారట అని అన్నారు.

ఓ వైపు పోరాటం అంటూనే మరో వైపు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బిజెపి అన్యాయం చేసిందని అంటూనే బిజెపి మంత్రి భార్యను టీటీడి మెంబర్ గా నియమించారని అన్నారు. హోదా పోరాటానికి ఢిల్లీ వెళ్లానని చెబుకుంటున్న చంద్రాబబు అగ్రిగోల్డ్ ఆస్తుల బ్రోకరిజం చేశారని ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -