Sunday, May 12, 2024
- Advertisement -

ధ‌ర్మానికి-అధ‌ర్మానికి జ‌రుగుతున్న ఎన్నిక‌లు…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక స‌మ‌రం దేశ వ్యాప్తంగా అస‌క్తిని క‌లిగిస్తోంది. ఒక ఉప ఎన్నిక‌కు ఎంత హంగా మా చేస్తున్నారో తెలుస్తోంది. టీడీపీ ఓడిపోతె అది బాబు ప‌త‌నానికి నాంది అనే వ్యాఖ్య‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటె ఇది అధికార పార్టీకి ఇది రెఫ‌రెండ‌మ్ లాంటిదే.

ప్ర‌ధానంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో రెండు విషయాల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. జ‌గ‌న్ ప‌దే ప‌దే విలువ‌లు-విశ్వ‌నీయ‌త‌కు, ధ‌ర్మానికి-అధ‌ర్మానికి జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌ని చెప్తున్నారు. ఒక సారి గ‌మ‌నిస్తే శిల్పా చక్రపాణిరెడ్డి .. అన్నకోసం ఎమ్మెల్సీ పదవినే ఫణంగా పెట్టారు. ఇది శిల్పా సోదరులకు నంద్యాల ఎన్నికల్లో చాలా పెద్ద ప్లస్ పాయింట్ కాబోతోంది. విలువలు – విశ్వసనీయతకు, అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలివని జగన్ పదేపదే చెప్తుండడం వెనుక కారణమిదే.

విలువలకు కట్టుబడి తాను చేసిన రాజీనామా ఆమోదం చెందడంతో శిల్పా చక్రపాణి రెడ్డి ధైర్యంగా ఓట్లడిగేందుకు అర్హత పొందారు. ఇప్పుడు అఖిలప్రియ మెడకు ఇదే పెద్ద అవరోధంగా మారింది. ఆళ్లగడ్డ అసెంబ్లీ నుంచి అఖిలప్రియ వైసీపీ తరపున గెలిచి..టీడీపీలో చేరి మంత్రి ప‌ద‌విని పొందారు. ప్ర‌తిప‌క్షాలు ముందు అఖిల ప్రియ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీలోకి రావాలంటే పదవికి రాజీనామా చేసిరావాలంటూ జగన్ స్పష్టంచేయడం.. ఆయన అదేవిధంగా రిజైన్ చేసి పార్టీలో చేరడం జరిగిపోయాయి.

ఇప్పుడు ఉపఎన్నికలో శిల్పా చక్రపాణి రెడ్డి ఇదే అస్త్రంగా చేసుకున్నారు. తనకు విలువులున్నాయి కాబట్టే పదవికి రాజీనామా చేసి బయటికొచ్చానని.. ఆ పని అఖిలప్రియ చేసి రాగలదా అని ప్రశ్నిస్తున్నారు. దమ్ముంటే మంత్రిపదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని చక్రపాణి రెడ్డి సవాల్ విసురుతున్నా..టీడీపీగాని ఫిరాయింపు మంత్రులు స‌మాధానం చెప్ప‌లేక పోతున్నారు.

నంద్యాల ఉపఎన్నికలో మొదటి నుంచి హాట్ ఇష్యూగా మారిన ‘విలువలు’ అనే అంశం చక్రపాణిరెడ్డి రాజీనామాతో మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు శిల్పా సోదరులు, జగన్ ఎక్కడికెళ్లినా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ భూమా కుటుంబాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నంద్యాల ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పును ఇస్తారొ చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -