Thursday, April 25, 2024
- Advertisement -

కేంద్ర బడ్జెట్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని వైసీపీఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ కాదు అసోం, కేరళ, బెంగాల్, తమిళనాడు బడ్జెట్‌గా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీకి కరోనా వ్యాక్సిన్ తప్ప ఒరిగింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు.

ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాలు కురిపించారని మండిపడ్డారు. ఏపీకి ఏమాత్రం నిధులు కేటాయించలేదని, రాష్ట్రానికి ఆత్మనిర్భర్ కూడా కనపడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి మెట్రో రైలు కోసం ఆరేళ్లగా అభ్యర్థిస్తున్నా పట్టించుకోలేదన్నారు. విజయవాడ, విశాఖలో మెట్రోను ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు కోరామని.. బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే లేకపోవడం దారుణమన్నారు. కొచ్చి మెట్రో,బెంగళూరు మెట్రో చెన్నై మెట్రో, నాసిక్ మెట్రో, నాగపూర్ మెట్రోలకు ఓకే చెప్పారని.. ఏపీకి ఇవ్వకపోడం దారుణమన్నారు. కొత్త టెక్స్‌టైల్‌ పార్క్‌ కావాలని కోరామని దానికి సంబంధించి బడ్జెట్‌లో ఏమాత్రం కేటాయింపులు లేవన్నారు.

పోలవరం సవరించిన అంచనాలపై మాట్లాడలేదని, ఫ్రైవేట్ కారిడార్ వల్ల పెద్దగా ఉపయోగం లేదని పేర్కొన్నారు. ఎక్కువ కిసాన్ రైళ్లను వేయాలని తాము కోరగా దాన్ని కేంద్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. నేషనల్ వైరాలజీ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చించి రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

గందరగోళం సృష్టించండి. అధికారులను భయపెట్టండి

పవన్ తో మూవీ.. సాయి పల్లవి పారితోషికం ఎంతో తెలుసా?

సొంత జిల్లాలో చంద్ర‌బాబుకు చేదు అనుభ‌వం!

బాబోయ్‌.. అనసూయ డిమాండ్‌ మాములుగా లేదుగా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -