Saturday, May 11, 2024
- Advertisement -

ఆర్టీఐ క‌మిష‌న‌ర్ల నియామ‌కంపై సీఎస్‌కు విజ‌య‌సాయి లేఖ‌..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై వైసీపీ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు ఆపార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సీఎస్ కు లేఖ రాశారు.విజయవాడకు చెందిన హోటల్ యజమాని ఐలాపురం రాజాను, ఏపీ విద్యా శాఖ మంత్రికి ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న శ్రీరాంమూర్తిని ఇన్ఫర్మేషన్ కమిషనర్లు గా నియమించడంపై లేఖ‌లో అభ్యంతరం తెలిపారు. టీడీపీ యాక్టివిస్టులైన వారిద్ద‌రిని ఆర్టీఐ క‌మిష‌న‌ర్లుగా నియ‌మించ‌డం త‌గ‌ద‌న్నారు.

ఆర్టీఐ యాక్ట్ 2005, సెక్షన్ 15 ప్రకారం ఈ నియామకాలు చేపట్టాలని ఆ లేఖలో విజయసాయిరెడ్డి కోరారు. ఆర్టీఐ యాక్ట్ 2005 సబ్ సెక్షన్ 5 ప్రకారం స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టేవారికి తగిన అర్హతలు ఉండాలని తెలియజేస్తోంద‌న్నారు.2017లో ఆరుగురిని ఆర్టీఐ కమిషనర్లుగా నియమించడంతో, ఆ నియామకాల్లో రాజకీయ ప్రమేయం ఉండటంతో ఆ నియామకాలను సుప్రీంకోర్టు కొట్టేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -