Tuesday, May 14, 2024
- Advertisement -

జ‌న‌సేన కండువా క‌ప్పుకోనున్న వైసీపీ కీల‌క నాయ‌కుడు….

- Advertisement -

వైయ‌స్ జ‌గ‌న్ స‌తీమ‌ణి వైయ‌స్ భార‌తికి స‌మీప బంధువు జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. వైసీపీలో ముఖ్య‌నాయుడిగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయ‌కుడు గౌత‌మ్‌రెడ్డి. విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో సీపీఐ నుంచి కార్పొరేట‌ర్ గా ఎదిగి వైసీపీ త‌రుపున 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసి టీడీపీ అభ్య‌ర్తి బోండా ఉమా చేతిలో 27 వేల ఓట్ల తేడాతో ఓట‌మిపాల‌య్యారు.

కొన్నాల్ల‌కు విజ‌య‌వాడ సెంట్ర‌ల్ బాధ్య‌త‌ల‌ను మొత్తం గౌతం రెడ్డి నుంచి స్ధానిక నాయ‌కుడు వంగ‌వీటి రాధాకు అప్ప‌గించారు జ‌గ‌న్‌. అప్ప‌టినుంచి పార్టీలో ఆయ‌న‌కు ప్రాధాన్య‌త త‌గ్గిస్తూ వ‌చ్చారు జ‌గ‌న్‌. దివంగ‌త వంగ‌వీటి రంగా హ‌త్యపై ప‌లు సంచ‌ల‌న కామెంట్లు చేసి, ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా కాపుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌కు గుర‌య్యారు.. ఆయ‌న కామెంట్ల పై కాపులు అంద‌రూ మండిప‌డ్డారు.. ఏకంగా పార్టీ నుంచి స‌స్పెండ్ చేసే వ‌ర‌కూ వంగ‌వీటి ఫ్యామిలీ జ‌గ‌న్ పై ప్రెజ‌ర్ తెచ్చింది. దీంతో గౌత‌మ్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది పార్టీ.

ఇక సీపీఐ నుంచి పార్టీలో త‌న‌కు అంత గుర్తింపు రాదు, ఇటు కాద‌న్న వైసీపీలో తిరిగి చేర‌డానికి అవ‌కాశం లేదు.. అలాగే వ్య‌తిరేక పార్టీ టీడీపీలోకి వెళితే మ‌ళ్లీ కార్పొరేట‌ర్ స్ధాయి మాత్ర‌మే వ‌స్తుంది అని ఆయ‌న ఆలోచించారు. భాజాపాలో చేరినా టీడీపీ-భాజాపా పొత్తులో భాగంగా టికెట్ వ‌స్తుందో రాదో తెలియ‌ని ప‌రిస్థితి. అందుకే త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఆలోచించే జ‌న‌సేన పార్టీలో చేర‌డానికి నిర్ణ‌యించుకున్నారంట‌.ఇప్ప‌టికే ప‌వ‌న్ స‌న్నిహితుల‌తో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే జ‌న‌సేన కండువా క‌ప్పుకోవ‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -