Thursday, March 28, 2024
- Advertisement -

టిక్ టాక్ తీసేయకుంటే ప్రమాదమేనట.. జాగ్రత్త..!

- Advertisement -

టిక్ టాక్ తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లను భారత్‌లో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. వాటిని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌ల నుంచి తీసేశారు. ఇప్పటికే వాటి నుంచి టిక్ టాక్ మాయమైంది. భారత్‌లో టిక్ టాక్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ యాప్స్ పై కొందరు డబ్బు కూడా సంపాధించిన వారు ఉన్నారు. ఇక ఈ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌ల నుంచి కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలనుకున్న వారికి ఇక ఆ అవకాశం లేదు.

అయితే, దేశంలో లక్షలాది మంది ఇన్‌స్టాల్‌ చేసుకున్న ఈ టిక్ టాక్ ఇప్పుడు ఇప్పుడు తీసివేయాలా( అన్‌ఇన్‌స్టాల్‌ ) చేయాలా? అన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది. ఒకేవేళ తీసివేయకుంటే ఏవైన ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉందా ? అన్న ప్రశ్న అందరిలో ఉంది. ఆ ప్రమాదం వారికి లేనప్పటికీ నిషేధించిన ఆ చైనా యాప్స్ అన్నీ ఆన్‌లైన్‌ ఆధారంగా పని చేసేవే. అవి స్మార్ట్‌ ఫోన్లలో ఇన్స్టాల్ అయి ఉన్నప్పటికీ పని చేయవు. ఆ యాప్‌లో అప్‌డేట్లు ఇకపై కనపడవు.

అయితే, ఆ యాప్‌ను స్మార్ట్‌ఫోన్లలో ఉంచుకోకపోతేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వాటిల్లో భద్రత తగ్గిపోతుండడంతో వాటి ద్వారా స్మార్ట్‌ఫోన్లు హ్యాకర్ల బారిన పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాగా, భారత్‌తో నిషేధం విధించిన నేపథ్యంలో ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు డేటా, ఇంటర్నెట్ ట్రాఫిక్ యాక్సెస్ చేయకుండా భారత్‌లో బ్లాక్‌ చేస్తారు. అయితే, ఒక్కోసారి కొన్ని యాప్‌ల ద్వారా హ్యాకర్లు దాడి చేసే ప్రమాదం ఎక్కువగానే ఉందని అంటున్నారు.

జయసుధకి విజయ నిర్మల గారు ఏమవుతారో తెలుసా ?

బాలయ్య బాబు గురించి మనకు తెలియని నిజాలు..!

గోపీచంద్ గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్..!

ఈ సినీ తారల ఆత్మహత్యల మిస్టరీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -